Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

ఐసీడీఎస్ మంత్రి తప్పుడు ప్రచారం ఆపాలి..!

ఐసీడీఎస్ మంత్రి తప్పుడు ప్రచారం ఆపాలి..!

అంగన్వాడీ ల ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా

పల్లా దేవేందర్ రెడ్డి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి

దేవరకొండ , మనసాక్షి:

అంగన్వాడీల సమ్మె పై రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తప్పుడు ప్రచారం ఆపాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నూనె రామస్వామి తెలిపారు.

దేవరకొండ లో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 13 వ రోజు జరుగుతున్న అంగన్ వాడీల సమ్మె లో బాగంగా ఈరోజు దేవరకొండ లో బారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ 13 రోజులుగా సమ్మే చేస్తున్న ప్రభుత్వం స్పందించకుండ తప్పుడు లెక్కలతో రాష్ట్ర మంత్రి ప్రెస్ మీట్ పెట్టడడం సరికాదని అన్నారు.

మన రాష్ట్రము కన్న వేరే రాష్ట్రాలలో వేతనాలు ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారని అన్నారు. ఏడు సంవత్సరాలుగా రాష్ట్రంలో టిఎ,డిఎ ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సేవలు చేస్తూ తెలంగాణ ప్రగతి కి మూల స్తంబాలుగా పనిచేస్తున్న అంగన్వాడీ ల పై ముఖ్యమంత్రి చొరవ చూపాలని, శ్రమకు తగిన ఫలితం అందించాలి అని డిమాండ్ చేశారు.

ALSO READ : BIG BREAKING : టీఎస్పిఎస్సి గ్రూప్ -1 ప్రిలిమ్స్ మళ్లీ రద్దు..!

టీచర్ కు రిటైర్మెంట్ బెనిఫిట్ 10 లక్షలు, హెల్పార్ కు ఐదు లక్షలు ఇవ్వాలని ,కనీస వేతనం 26,000 ఇవ్వాలని, బి ఎల్ ఓ డ్యూటీ లు రద్దు చేయాలని కోరారు. ఏడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న టి ఏ ,డి ఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, అంగన్వాడిలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కోశాధికారి,జే వెంకట్ రాములు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వలమల్ల ఆంజనేయులు,అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు వణం రాధిక ,ఉపాధ్యక్షులు అరుణ, ప్రాజెక్ట్ నాయకులు నాగమణి, శాంతా బాయి మణమ్మ స్వప్న ప్రభావతి, సుజాత, విజయ, చేంద్రకల , ఎల్లమ్మ, లావణ్య, బగ్యమ్మ, జ్యోతీ,గోపిక, విజయ కుమారి, రాజమణి, నీలా , సంధ్య, పాతీమ, మంగా, రమా వెంకట్, శాంతా బాయి, సువార్త, పార్వతి, లక్ష్మి,కవిత, బొడ్డు పల్లి అర్జున్
తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :

  1. Ts Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..!
  2. Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!

మరిన్ని వార్తలు