సూర్యాపేట : ఎన్నికల విధులు, విధానాలపై పూర్తి అవగాహన ఉండాలి..!
సూర్యాపేట : ఎన్నికల విధులు, విధానాలపై పూర్తి అవగాహన ఉండాలి..!
జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్
సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకం
సూర్యాపేట, మనసాక్షి :
జిల్లాలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సెక్టోరల్ అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ యస్. వెంకట్రావ్ సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెక్టోరల్ అధికారులకు మొదటి దఫా ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో యస్.పి రాజేంద్ర ప్రసాద్, అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, ఏ. వెంకట్ రెడ్డి లతో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో సెక్టోరల్ అధికారులు విధులు , బాధ్యతలు కీలకమని నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలలో మూడు పర్యాయాలు సందర్శించి మౌలిక వసతుల పరిశీలన చేసి సత్వర చర్యలకై నివేదికలు అందించాలని అన్నారు.
ALSO READ : BIG BREAKING : టీఎస్పిఎస్సి గ్రూప్ -1 ప్రిలిమ్స్ మళ్లీ రద్దు..!
వృద్ధులు,వికలాంగులకు ఎన్నికల సంఘం 12..బి ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓటు కల్పించిందని తెలిపారు. ఎస్ ఎస్ టి, వి ఎస్ టి, ఎఫ్ ఎస్ అలాగే కమిటీల నిర్వహణ , ఎన్నికల విధి విధానాలపై సమీక్షించారు. గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్, నెట్ వర్క్ కనెక్షన్, మైక్రో అబసర్వర్ వీడియో గ్రాఫీ ఉండాలని, శాంతి భద్రతల విషయంలో నిఘా తో పాటు పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు.
ఓటర్ స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణం లో తమ ఓటు హక్కును వినియోగించుకునేల చూడాలని సూచించారు. కొత్త పోలింగ్ కేంద్రాలకు కూడా రూట్ మ్యాప్ పొందుపరిచి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. సి. విజిల్ యాప్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే జిల్లా , రాష్ట్ర స్థాయి బోర్డర్ చెక్ పోస్టుల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీలు చేపట్టాలని తెలిపారు.
ALSO READ : Ts Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..!
కార్యక్రమంలో భాగంగా జిల్లా యస్.పి. మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో భాగంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పటిష్ట నిఘా ఉంచామని ఎక్కడకూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల విషయంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తదుపరి మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ అందించారు.
ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ లు సూర్యాపేట వీర బ్రహ్మ చారి, కోదాడ సూర్యనారాయణ, హుజూర్ నగర్ జగదీశ్వర్ రెడ్డి , డి.యస్.పి. లు నాగభూషణం, రవి, డిఆర్డీఓ కిరణ్ కుమార్, సి.పి.ఓ వెంకటేశ్వర్లు, ఏ. డి.ఏ రామారావు నాయక్, డి.హెచ్.ఓ శ్రీధర్, తహశీల్దార్లు, వివిధ శాఖల అధికారులు, మాస్టర్ ట్రైనర్స్ వి. రమేష్, టి. పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!









