Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

రాష్ట్రంలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కలిసిపోయాయి..!

రాష్ట్రంలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కలిసిపోయాయి..!

ముఖ్యకార్యకర్తల సమావేశంలో జూలకంటి

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

రానున్న ఎన్నికల్లో కమ్యూనిస్టుల పాత్ర కీలకమని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న తెలంగాణ ఎన్నికల్లో కమ్యూనిస్టులు కీలకంగా వ్యవహరిస్తారని చెప్పారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని, ప్రజలు కమ్యూనిస్థుల పట్ల విశ్వాసంగా ఉన్నారని చెప్పారు.

సమస్యలపై జరుగుతున్న పోరాటాలకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. ఎన్నికల ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు.

రాష్ట్రంలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కలిసిపోయాయని తమ ఆధిపత్యాన్ని పాకులాడుతున్నాయని విమర్శించారు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు. మాటలతో ప్రజలను మభ్యపెడుతున్న ప్రభుత్వాలను ఈ ఎన్నికలో ఓడించి బుద్ధి చెప్పాలన్నారు.

ALSO READ : Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!

ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు త్వరలో ఇంటింటికి సీపీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతి ఇంటికి వెళ్లి పాలకుల విధానాలు వివరించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు.

ప్రజా సమస్యలను గుర్తించి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా పని చేయలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘ జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు గాదె పద్మ, జిల్లా కమిటీ సభ్యులు రాగిరెడ్డి మంగా రెడ్డి,

ALSO READ : Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!

రేమిడల పరుశురాములు, వినోద్ నాయక్, నాయకులు రొండి శ్రీనివాస్, దయనంద్, సైదులు, ఊర్మిల, కరిమున్నిసా, ఎర్ర నాయక్, ఖాజా మొయినోద్దీన్, దేవయ్య, పిల్లుట్ల సైదులు, కోటిరెడ్డి,పతని శ్రీను,చిరుమళ్ల బిక్షం,వెంకట్ రెడ్డి,మల్లయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :

1. Ts Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..!

2. మాడ్గులపల్లి : తల్లితండ్రులు మందలించారని.. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య..!

మరిన్ని వార్తలు