మిర్యాలగూడ : సిపిఎం , కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో భారీగా చేరిక..!
మిర్యాలగూడ : సిపిఎం , కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో భారీగా చేరిక..!
మిర్యాలగూడ , మన సాక్షి:
మిర్యాలగూడెం నియోజకవర్గం లోని వేములపల్లి మండలం రావులపెంట గ్రామం నుంచి కాంగ్రెస్, సి.పి.యం పార్టీలకు చెందిన వార్డ్ మెంబర్ల తో సహా 200 మంది కార్యకర్తలు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములపల్లి మండల బి.ఆర్.ఎస్ పార్టీ అద్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, సర్పంచ్ దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి, వేములపల్లి మండల యువజన అద్యక్షులు పిండి సతీష్ రెడ్డి అద్వర్యంలో టిఆర్ఎస్ లో చేరారు.
పార్టీలో చేరిన వారికి రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గులాబీ కండువా కప్పి పార్టీ లోనికి స్వాగతించారు. చేరిన వారిలో (శీలం సైదులు, యట నాగమ్మ, రేవెల్లి రామచంద్రు, శీలం లింగయ్య, మద్దుల రవి, ఉత్తెర్ల లింగయ్య, దొంతిరెడ్డి రాంరెడ్డి, దొంతిరెడ్డి కృష్ణ రెడ్డి, ఉత్తెర్ల శ్రీను, బచ్చలకురి సైదులు) తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి ఇంటికీ సంక్షేమం అందిస్తూ ప్రతి ముఖంలో ఆనందం నింపుతున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ కే దక్కుతుంది అని అన్నారు. దేశం లో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది అని అన్నారు.
కే.సీ.ఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ద్వారా రావులపెంట గ్రామానికి ఇప్పటి వరకు 48 కోట్ల 26 లక్షల 50 వేల 983 రూపాయల మంజూరు అయ్యాయి అని తెలిపారు.
ALSO READ : Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మిర్యాలగూడ మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, ఎం.పీ.టీ.సీ నంద్యాల శ్రీరాం రెడ్డి, రైతు సమన్వయ సమితి అద్యక్షులు కందుల నాగిరెడ్డి, గ్రామ శాఖ అద్యక్షులు సందన బొయిన చంద్రయ్య, మాలవత్ రవీందర్ నాయక్, వల్లపుదాసు వెంకటేశ్వర్లు, నిడుగొండ రామచంద్రు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : Car Driver : కారు డ్రైవర్ ఖాతాలో రూ. 9 వేల కోట్లు జమ.. ఒక్కసారిగా షాక్ అయిన డ్రైవర్..!










