Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsviralక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Khairathabad Crocodile : ఖైరతాబాద్ నాలాలో మొసలి ప్రత్యక్షం.. భయాందోళనలో ప్రజలు..!

Khairathabad Crocodile : ఖైరతాబాద్ నాలాలో మొసలి ప్రత్యక్షం.. భయాందోళనలో ప్రజలు..!

హైదరాబాద్, మన సాక్షి :

హైదరాబాద్ మహానగరంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు నాళాలు పొంగిపొర్లాయి. ఈ క్రమంలో ఖైరతాబాద్ పరిధిలో ఉన్న చింతల్ బస్తి నాలాలో ముసలి పిల్ల ప్రత్యక్షమైంది.

దాన్ని చూడడానికి స్థానికులు పరుగులు తీశారు. మొసలి పిల్ల రావడం కలకలం రేపింది. దాంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఆనంద్ నగర్ – చింతల్ బస్తి మధ్య నూతన వంతెన నిర్మాణం కోసం కూల్చివేతలు చేపట్టారు.

ఆ ప్రాంతంలో ఈ ముసలి పిల్ల ఒడ్డుకు చేరింది. మొసలి పిల్లను గమనించిన స్థానికులు అటవీ శాఖ, జిహెచ్ఎంసి, పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని అటవీశాఖ అధికారులకు సమాచారం తెలియజేశారు.

ALSO READ : Balapur Ganesh Laddu : రూ. 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు.. వేలంపాటలో దక్కించుకున్న రియాల్టర్..!

నాలాపై నిర్మాణ పనులు మూడు నెలలుగా సాగుతున్నాయి. పనులు పూర్తి కాకపోవడంతో పాటు ముసలి పిల్ల ప్రత్యక్షం కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో వైపు గణేష్ నిమజ్జనం కొనసాగుతుండగా మరోవైపు వర్షానికి నాలాలు పొంగిపొర్లుతున్నాయి.

ఖైరతాబాద్ లో ప్రత్యక్షమైన మొసలి పిల్ల ఐదు అడుగుల పొడవు వరకు ఉండవచ్చు అని స్థానిక అధికారులు అంచనా వేశారు. ప్రవాహంలో తల్లిముసలి కూడా ఉందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలా వెంటనే నివాసాలు ఉన్నాయి.

దాంతో అది అర్ధరాత్రి ఎక్కడ నివాసాల్లోకి వస్తుందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నాలాలో మొసలి పిల్ల ఒకటే ఉందా..? లేక ఇంకేమైనా ఉన్నాయా..? అనే అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నాలాలో ప్రవాహానికి కొట్టుకొచ్చిన ముసలి పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై అధికారులు దృష్టి పెట్టారు.

ALSO READ : హైదరాబాద్ : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు వేలంపాట.. రూ.1.26 కోట్లు, అది ఎక్కడంటే..!

మరిన్ని వార్తలు