Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

ACB : మర్రిగూడ తహసిల్దార్ ఇంట్లో కట్టల కొద్ది నోట్లు.. కిలోల కొద్ది బంగారం.. ఏసీబీ దాడుల్లో బయటపడ్డ వైనం..!

ACB : మర్రిగూడ తహసిల్దార్ ఇంట్లో కట్టల కొద్ది నోట్లు.. కిలోల కొద్ది బంగారం.. ఏసీబీ దాడుల్లో బయటపడ్డ వైనం..!

మర్రిగూడ , మనసాక్షి :

నల్గొండ జిల్లా మర్రిగూడ మండల తహసిల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో కట్టల కొద్ది నోట్లు.. కిలోల కొద్ది బంగారం బయటపడింది. ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడంతో బండారం బయటపడింది. తహసిల్దార్ నివాసంలో కట్టల కొద్ది నోట్లు.. ట్రంక్ పెట్టెలో రెండు కోట్లకు పైగా నగదు లభ్యమయింది.

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని మహేందర్ రెడ్డి పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మహేందర్ రెడ్డి కి సంబంధించిన 15చోట్ల ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఆయన ఇటీవలే కందుకూరు నుంచి మర్రిగూడ మండలానికి బదిలీపై వచ్చారు. ఆయన స్వస్థలం ఇబ్రహీంపట్నం. కాగా ఇంకా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.

ALSO READ : Suryapet : గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాల పంపిణీ చేసిన మంత్రి.. అనంతరం కొట్టుకున్న బీఆర్ఎస్ నాయకులు..!

మరిన్ని వార్తలు