Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : ఏరియా ఆసుపత్రిలో గుర్తుతెలియని మృతదేహం..!

Miryalaguda : ఏరియా ఆసుపత్రిలో గుర్తుతెలియని మృతదేహం..!

మిర్యాలగూడ, మనసాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ లో గుర్తు తెలియని మగ మనిషి మృతదేహం ఉన్నట్లు టు టౌన్ ఇన్స్ పెక్టర్ నరసింహారావు తెలిపారు. టూ టౌన్ ఇన్స్ పెక్టర్ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం..

మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ లో ఒక గుర్తు తెలియని మగ మనిషి చనిపోవడం జరిగిందని తెలిపారు. అనారోగ్యంతో రోడ్ మీద ఉండడంతో అంబులెన్స్ లో మిర్యాలగూడ ఏరియా హాస్పటల్ కి తరలించగా చికిత్స పొందుతూ, ఆరోగ్యం వికటించి మరణించినాడు.

ALSO READ : ACB : మర్రిగూడ తహసిల్దార్ ఇంట్లో కట్టల కొద్ది నోట్లు.. కిలోల కొద్ది బంగారం.. ఏసీబీ దాడుల్లో బయటపడ్డ వైనం..!

మృతుడు సుమారు 60-65 సంవత్సరాలు వయసు కలిగి, ఛామన ఛాయా రంగులో కలిగి 5.4″ ఎత్తు ఉన్నది. ఇట్టి గుర్తు తెలియని వ్యక్తి గత వారం రోజుల నుండి మిర్యాలగూడ ఏరియా హాస్పటల్ లో చికిత్స పొందుతూ శనివారం మరణించినాడు.

కావున పై వివరాలతో ఎవరైనా తప్పి పోయిన వారు ఉన్నా, ఎవరికైనా వివరాలు తెలిసినా ఈ నెంబర్లకు 8712670150, 8186865497 తెలియజేయగలరని కోరారు.

ALSO READ : Fake Certificates : బోగస్ సర్టిఫికెట్లతో ఎంబిబిఎస్ సీట్లు.. వెరిఫికేషన్ లో ట్విస్ట్..!

మరిన్ని వార్తలు