Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండసంక్షేమం

Miryalaguda : ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భాస్కర్ రావు

Miryalaguda : ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భాస్కర్ రావు

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

మిర్యాలగూడ మండలం దొండవారిగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నివాసిత స్థలాల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొని 180 మందికి పట్టాలు పంపిణీ చేశారు.

ALSO READ : ACB : మర్రిగూడ తహసిల్దార్ ఇంట్లో కట్టల కొద్ది నోట్లు.. కిలోల కొద్ది బంగారం.. ఏసీబీ దాడుల్లో బయటపడ్డ వైనం..!

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కే.సీ.ఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ద్వారా దొండవారిగూడెం గ్రామానికి ఇప్పటి వరకు 11 కోట్ల 7 లక్షల 63 వేల 659 రూపాయలు మంజూరు అయ్యాయి అని తెలిపారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎం.పి.పి నూకల సరళ హనుమంత్ రెడ్డి,

ఆర్డీవో ఆడియో చెన్నయ్య, వైస్ ఎం.పి.పి అమరావతి సైదులు, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, సర్పంచ్ ఎలకాని సుజాత రమణ, పాశం నరసింహ రెడ్డి, మంజ్య నాయక్, ఎం.పి.టి.సి పాశం హైమవతి, గ్రామ పార్టీ అద్యక్షులు వీరమల్ల ఏడుకొండలు, చింతల వెంకటేశ్వర్లు, శ్రీకాంత్ రెడ్డి, చీన్యా నాయక్, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Congress Party : కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు మరో కొత్త పథకం.. విద్యార్థులకు..!

మరిన్ని వార్తలు