Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Munugodu : మునుగోడు కాంగ్రెస్ మూడు ముక్కలు..!

Munugodu : మునుగోడు కాంగ్రెస్ మూడు ముక్కలు..!

మర్రిగూడ , మన సాక్షి:

మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడు ముక్కలుగా అయింది.మర్రిగూడ మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎటుపోవాలని తెలియక తలలు పట్టుకుంటున్నారు. నియోజకవర్గ స్థాయిలో శనివారం ఇటు చలమల కృష్ణారెడ్డి. అటు పాల్వాయి స్రవంతి. ఇంకోపక్క రాజగోపాల్ రెడ్డి ఇలా వేరు వేరు గా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.

కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది. కొంతమంది ముఖ్య నేతలు రాజగోపాల్ రెడ్డి వెంబడి ఢిల్లీకి వెళ్లడం జరిగింది. చలమల కృష్ణారెడ్డి మునుగోడులో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తుర్కయంజాల్లోపాల్వాయిస్రవంతి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇలా మునుగోడులో కాంగ్రెస్ మూడు ముక్కలుగా దర్శనమిస్తుంది.

కార్యకర్తలు అయోమయంగా ఎటు వెళ్లాలో తెలవక తికమక పడుతున్నారు. కాంగ్రెస్ పరిస్థితి నియోజకవర్గంలో మూడు ముక్కల్లాగా. మర్రిగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు మండలాధ్యక్షులు ఉండడం పెద్ద చర్చ జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డికి ఒకరు, పాల్వా స్రవంతి ఒకరు, చలమల కృష్ణారెడ్డికి ఒక్కరు. మునుగోడులో గ్రూపుల తగాదాలు పరిష్కారమైతేనే. ఇక్కడ గెలుపు సాధ్యమవుతుందని కార్యకర్తలు అనుకుంటున్నారు.

ALSO READ : కాంగ్రెస్ లో అసమతి రాగం.. మునుగోడు టికెట్ ఆశించి బంగపడిన చల్లమల్ల సెల్ఫీ (వీడియో) వైరల్..!

ఇలా ఒకే పార్టీ మూడు ముక్కల్లాగా ముగ్గురు నాయకత్వంలో నడవాలంటేపార్టీకి తలనొప్పులు తప్పవని కార్యకర్తల భావన. తండ్రి వారసత్వం వచ్చిన నేత ఒకరైతే, పార్టీ కష్టకాలంలో ఒక వ్యక్తి వదిలి వెళితే15 నెలల నుండి పార్టీని కాపాడుతూ వస్తున్న వ్యక్తి ఒకరు.

కాంగ్రెస్ పార్టీని వదిలి బిజెపి పార్టీలో జాయిన్ అయ్యి ఉప ఎన్నికలు ఓటమి పొంది తిరిగి కాంగ్రెస్ లో చేరి మునుగోడు కాంగ్రెస్ టికేటు రాజగోపాల్ రెడ్డి తెచ్చుకున్నారు. ఢిల్లీ అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో కార్యకర్తలు తీవ్ర మనోవేదన చెందుతున్నారు.

ఒక పార్టీ మారే నాయకునికి టికెట్ ఎలా ఇస్తారని  బహిరంగనే కార్యకర్తలు విమర్శిస్తున్నారు. కార్యకర్తలు ఎవరిని నమ్మాలో అర్థం కాని స్థితిలో కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు ఎవర్ని నిజమైన కాంగ్రెస్ వాదిగా గుర్తిస్తారు? ఏ వర్గం వాళ్లు ఎక్కడ ఓటేస్తారు?

ALSO READ : ఫ్లోరైడ్ ను తరిమి కొట్టాము.. మునుగోడు చైతన్యం చూపాలి.. పనికిమాలిన వాళ్లు కాంగ్రెస్ వాళ్లు..!

మరిన్ని వార్తలు