ఫ్లోరైడ్ ను తరిమి కొట్టాము.. మునుగోడు చైతన్యం చూపాలి.. పనికిమాలిన వాళ్లు కాంగ్రెస్ వాళ్లు..!

మునుగోడు ఉప ఎన్నికల్లో విలక్షణ తీర్పు ఇచ్చారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామూ.విలక్షణముగా ఆలోచన చేసి ఓటు వెయ్యాలని ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. గురువారం నల్గొండ జిల్లా మునుగోడు లో నియోజకవర్గస్థాయి ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

ఫ్లోరైడ్ ను తరిమి కొట్టాము.. మునుగోడు చైతన్యం చూపాలి.. పనికిమాలిన వాళ్లు కాంగ్రెస్ వాళ్లు..!

పూటకో పార్టీ మరే దళారులను నమ్మొద్దు

సభకు ముఖ్య నేతలు దూరం.?

నల్గొండ జిల్లా మునుగోడు ఆశీర్వాద సభలో కేసీఆర్

మునుగోడు, మన సాక్షి:

మునుగోడు ఉప ఎన్నికల్లో విలక్షణ తీర్పు ఇచ్చారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామూ.విలక్షణముగా ఆలోచన చేసి ఓటు వెయ్యాలని ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. గురువారం నల్గొండ జిల్లా మునుగోడు లో నియోజకవర్గస్థాయి ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

ఈ సందర్భంగా మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మరోసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయం లో ఫ్లోరైడ్ ను పెంచి పోషించారని, ఎవ్వరు ఫ్లోరైడ్ కు పరిష్కారం చూపలేదన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్లోరైడ్ ను తరిమి కొట్టామని, ఎంఎల్ఏ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉద్యమ కారుడు… మళ్ళీ గెలిపించండి అన్నారు. ఇవ్వాళ కాంగ్రెస్ వాళ్లు ఛాలెంజ్ చేస్తున్నారు… వాళ్లకు కనీస అవగాహన లేదు.. పనికి మాలిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్లు.. డబ్బు మదంతో మాట్లాడుతూ న్నారు వారు అన్నారు.

ALSO READ : Congress Big Plan : కాంగ్రెస్ బిగ్ ప్లాన్.. కెసిఆర్, కేటీఆర్ పై పోటీకి కాంగ్రెస్ సీనియర్ నేతలు.. ఎవరెవరు ఎక్కడంటే..?

యావత్ దేశంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం మన తెలంగాణ, పక్కా రాష్ట్రం కర్ణాటక లో కరెంట్ ఇవ్వలేక చేతులెత్తేశారు కాంగ్రెస్ వాళ్లు, అక్కడ అన్నదాతలు అరి గోస పెడుతున్నరని అన్నారు. తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్, అనుక్షణం ప్రజల కోసమే కృషి చేస్తోందని, మళ్ళీ వచ్చే ప్రభుత్వం లో అందరికి భీమా అమలు చేస్తాం.. సన్న బియ్యం అందిస్తాం..పెంచిన పెన్షన్ లను ఇస్తాం….అన్ని ఆలోచన చేయాలి.. మునుగోడు చైతన్యం చూపాలి అన్నారు.

ఇక్కడ పూటకో పార్టీ మరే దళారులను నమ్మొద్దు… డబ్బు మదం తో విర్రవీగుతున్నారు. వాళ్లకు బుద్ధి చెప్పాలి..పాలమూరు రంగారెడ్డి పథంకం ద్వారా నీళ్లు ఇస్తాం…కాంగ్రెస్ వస్తే కరంట్ ఖతం అవుతది…..అన్ని ఆలోచన చేయాలి. ఎన్నికల్లో బిఆర్ఎస్ ని గెలిపించాలి అన్నారు.

ALSO READ : Google Pay : గూగుల్ పే ఈజీ లోన్ రూ.15000, ఈఎంఐ కేవలం రూ. 111 మాత్రమే..!

కెసిఆర్ సభకు ముఖ్య నేతలు దూరం :

మునుగోడు లో సీఎం కేసీ నిర్వహించిన నియోజకవర్గస్థాయి ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని ముఖ్య నేతలు దూరంగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ప్రచారం నిర్వహించి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుకు కృషి చేసిన పలువురు నాయకులు ఆశీర్వాద సభకు వెళ్లలేదు. బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై వ్యతిరేకత వల్ల నియోజకవర్గంలోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు కూడా సభకు వెళ్లలేదని సమాచారం. ఈ విషయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.