Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Congress Big Plan : కాంగ్రెస్ బిగ్ ప్లాన్.. కెసిఆర్, కేటీఆర్ పై పోటీకి కాంగ్రెస్ సీనియర్ నేతలు.. ఎవరెవరు ఎక్కడంటే..?

Congress Big Plan : కాంగ్రెస్ బిగ్ ప్లాన్.. కెసిఆర్, కేటీఆర్ పై పోటీకి కాంగ్రెస్ సీనియర్ నేతలు.. ఎవరెవరు ఎక్కడంటే..?

హైదరాబాద్ , మన సాక్షి :

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో దూకుడు పెంచిందని చెప్పవచ్చును. ఆ పార్టీకి రోజురోజుకు ప్రజల్లో కూడా ఆదరణ పెరుగుతుంది. ఈసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు కూడా పేర్కొంటున్నారు. టిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా రెండుచోట్ల పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ ను కట్టడి చేసేందుకు గాను బిగ్ ప్లాన్ చేశారు. కెసిఆర్ పోటీ చేస్తున్న రెండు స్థానాలతో పాటు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోటీ చేస్తున్న స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ALSO READ : Google Pay : గూగుల్ పే ఈజీ లోన్ రూ.15000, ఈఎంఐ కేవలం రూ. 111 మాత్రమే..!

కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు చోట్ల పోటీ చేసేందుకు అధిష్టానం ప్లాన్ చేస్తుంది. అదేవిధంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లలో మాజీ పిసిసి అధ్యక్షులు సీనియర్ నేత ఉత్తంకుమార్ రెడ్డి పోటీ చేసేందుకు ఆ పార్టీ అధిష్టానం ప్లాన్ చేస్తుంది.

ఈ ముగ్గురు కూడా వారి వారి సొంత నియోజకవర్గాలలో పోటీ చేయడంతో పాటు కేసీఆర్, కేటీఆర్ పై పోటీకి దింపాలని అధిష్టానం నిర్ణయించింది. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం తో పాటు కామారెడ్డి లేదా గజ్వేల్ లో పోటీ చేసేందుకు ఆ పార్టీ ప్లాన్ చేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం తో పాటు కామారెడ్డి లో కానీ గజ్వేల్ లో కానీ పోటీకి దింపేందుకు సిద్ధమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలో పోటీ చేయడంతో పాటు సిరిసిల్లలో కూడా పోటీకి దింపాలని నిర్ణయించింది.

ALSO READ : కొలిక్కి రాని వామపక్షాల నియోజకవర్గాలు.. 50 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు.. రెండో జాబితా విడుదలకు సిద్ధం..!

రసవత్తరంగా తెలంగాణ ఎన్నికలు :

గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. రాజకీయ నాయకులు వేసుకునే సవాళ్లు ప్రతి సవాళ్లు ఎన్నికల వరకే ఉండేవి. గతంలో సవాళ్లకు ప్రతి సవాళ్లు మాత్రమే చేసేవారు. కానీ నేరుగా ఒకే చోట పోటీ చేసి సత్తా నిరూపించుకునేవారు కాదు. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా బీఆర్ఎస్ ను కట్టడి చేయాలని కెసిఆర్, కేటీఆర్ దూకుడుకు కళ్లెం వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఆ పార్టీ అధిష్టానం కేసీఆర్, కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్లను దించాలని భావిస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరలో ఉన్నందున రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తుంది. కెసిఆర్ వ్యూహంకు కాంగ్రెస్ అధిష్టానం కూడా ప్రతి వ్యూహం తో రెడీగా ఉంటుంది. ఏదేమైనా మరొక కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

ALSO READ : కొన్ని కారణాల వల్ల కొంత మంది ఎంఎల్ఏ లు నాతో విడిపోవచ్చు.. అయినా వారి విజయాన్నే కోరుకుంటున్నా..!

మరిన్ని వార్తలు