కొలిక్కి రాని వామపక్షాల నియోజకవర్గాలు.. 50 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు.. రెండో జాబితా విడుదలకు సిద్ధం..!

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో వెళ్లిపోయిన నాయకులు తిరిగి సొంతగూటికి చేరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రచారం కూడా జోరుగా సాగుతుంది.

కొలిక్కి రాని వామపక్షాల నియోజకవర్గాలు.. 50 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు.. రెండో జాబితా విడుదలకు సిద్ధం..!

హైదరాబాద్, మన సాక్షి :

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో వెళ్లిపోయిన నాయకులు తిరిగి సొంతగూటికి చేరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రచారం కూడా జోరుగా సాగుతుంది.

దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరే విధంగా ఉన్నందున.. ఆ పార్టీ నేతలు గ్యారెంటీ పథకాలే తమను గ్యారెంటీగా గెలిపిస్తాయని నమ్ముతున్నారు. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ నేతలు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 55 మంది తో మొదటి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీరంతా ఆయా నియోజకవర్గాలలో ప్రచారాలు ముమ్మరం చేస్తున్నారు.

ALSO READ : Google Pay : గూగుల్ పే ఈజీ లోన్ రూ.15000, ఈఎంఐ కేవలం రూ. 111 మాత్రమే..!

రెండవ జాబితా పై కసరత్తు పూర్తి :

కాంగ్రెస్ పార్టీ మరో 64 నియోజకవర్గాల తో రెండవ జాబితాను సిద్ధం చేయటానికి కసరత్తు నిర్వహిస్తుంది. ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో మకాం వేసి ఇప్పటివరకు 50 స్థానాలపై చర్చించారు. దాదాపుగా 50 స్థానాలలో అభ్యర్థుల ఖరారు అయినట్లు సమాచారం. మరో 10 స్థానాల్లో మరోసారి చర్చించిన అనంతరం జాబితాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ALSO READ : WhatsApp | వాట్సాప్ సరికొత్త ఫీచర్.. ఓకే ఫోన్ లో రెండు ఖాతాలు..!

ఖరారు కానీ పక్షాల సీట్లు :

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తో వామపక్షాల పార్టీలు అవగాహన కుదుర్చుకొని ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి తమకు సీట్లు కేటాయిస్తే కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. కాగా సిపిఐ కి చెన్నూరు, కొత్తగూడెం స్థానాలను కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కాగా సిపిఐ నుంచి మునుగోడు నియోజకవర్గం కేటాయించాలని కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా కాంగ్రెస్ పార్టీ మాత్రం సిపిఐ కి చెన్నూరు , కొత్తగూడెం నియోజకవర్గం కేటాయించేందుకే సిద్ధమైంది. ఇది ఇలా ఉండగా సిపిఎం కు మిర్యాలగూడ స్థానాన్ని కేటాయించేందుకు కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. కానీ ఆ పార్టీ నేతలు మిర్యాలగూడ తో పాటు ఖమ్మం జిల్లాలో ఖమ్మం కాని పాలేరు నియోజకవర్గం కానీ కేటాయించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీకి వామపక్ష పార్టీలకు ఇంకా కొలిక్కి రాలేదు.

ALSO READ : నల్గొండ : బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. గుత్తా ముఖ్య అనుచరుడు కాంగ్రెసులో చేరిక..!