Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

సూర్యాపేట : హై టెన్షన్ నడుమ నామినేషన్ విత్ డ్రా చేసుకున్న పటేల్ రమేష్ రెడ్డి.. ఎవరికి మద్దతు అంటే..!

సూర్యాపేట : హై టెన్షన్ నడుమ నామినేషన్ విత్ డ్రా చేసుకున్న పటేల్ రమేష్ రెడ్డి.. ఎవరికి మద్దతు అంటే..!

కన్నీటి పర్యంతం అయిన రమేష్ రెడ్డి

సూర్యాపేట ,  మనసాక్షి

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు టికెట్ ఇవ్వలేదని బాధతో కార్యకరల వత్తిడి మేరకు ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుండి సింహం గుర్తు పైన పోటీచేయాలనీ నిర్ణయుంచుకొని, ప్రచారం సైతం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దూతలను పంపి రమేష్ రెడ్డి చే నామినేష ఉపసంహారంప జేశారు.

నామినేషన్ విత్ డ్రాకు వెళ్లకుండా పటేల్ రమేష్ రెడ్డి, మల్లు రవి, రోహిత్ చౌదరి లను రమేష్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో నల్గొండ ఎంపీగా అవకాశం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి గా రంగంలో ఉన్న పటేల్ రమేష్ రెడ్డి పోటీ నుండి విరమించుకున్నారు. నామినేషన్ విత్ డ్రా అనంతరం తన టైం బాగా లేదంటూ రమేష్ రెడ్డి కన్నీటి పర్యంతమైనారు.

ALSO READ : మిర్యాలగూడ : కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు.. బిఎల్ఆర్ సంచలన ప్రకటన.. సంపాదనలో 80 శాతం వారికి వెచ్చిస్తా..!

తెలంగాణ లో కర్ణాటక ఫార్ములా :

పోటి చేసే అభ్యర్థులను గెలిపిస్తే టిక్కెట్ లు రాని వారికి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పదవులు అనే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అమలుచేసి విజయం సాధించింది. అదే ఫార్ములా తెలంగాణలో అమలుచేస్తుంది. అందులో భాగంగానే సూర్యాపేట లో అసమ్మతి నేతగా నామినేషన్ వేసిన పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించే విధంగా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పావులు కదిపింది.

బుధవారం ఉదయం మల్లు రవి,ఏ ఐ సి సి కార్యదర్శి రోహిత్ చౌదరి లు సూర్యాపేట కు వచ్చి అసమ్మతి నేత పటేల్ రమేష్ రెడ్డి తో చర్చలు జరిపారు. … అనంతరం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.

త్వరలోనే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ని ఆయన కలవనున్నారు.‌‌ సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి గెలుపు కొరకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. కార్యకర్తలు ఎవరు ఆదర్యము చెందావద్దని పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేద్దామని బాధతప్త హృదయం తో వేడుకొన్నారు.

ALSO READ : Elections : ఎన్నికల్లో ఓటు వేస్తారా.. ఆ సెకండ్లే కీలకం.. ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

మరిన్ని వార్తలు