BREAKING : లక్షేట్టిపేట్ ప్రభుత్వ పాఠశాలలో అగ్నిప్రమాదం
BREAKING : లక్షేట్టిపేట్ ప్రభుత్వ పాఠశాలలో అగ్నిప్రమాదం
లక్షెట్టిపేట్ , (మన సాక్షి);
మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ మున్సిపాలిటీ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల లో అగ్ని ప్రమాదం సంభవించింది, షాట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది, ఆదివారం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది, భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పడానికి స్థానికులు ప్రయత్నించారు.
ALSO READ : Runa Mafi : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రుణమాఫీ పై కీలక ప్రకటన..!
స్థానికంగా అగ్నిమాపక స్టేషన్ లేకపోవడం తో మంటలు ఆర్పేందుకు అవకాశం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంటలు చెలరేగుతున్నాయని తెలుసుకున్న లక్షేట్టిపేట్ ఎస్సై లక్ష్మణ్ ధర్మపురి ఫైర్ స్టేషన్ నుండి ఫైర్ ఇంజన్ పిలిపించి మంటలు ఆర్పడానికి తన వంతు కృషి చేశారు.
మంటలు ఆర్పడానికి వచ్చిన ఫైర్ సిబ్బందిని లక్ష్మీనారాయణ, శంకరయ్య, శ్రీనివాస్ ని లక్షేట్టిపేట్ ప్రజలు అభినందించారు.
ALSO READ : BREAKING : జిల్లా కలెక్టర్ గన్ మెన్ తన కుటుంబ సభ్యులను కాల్చి.. తాను ఆత్మహత్య..!









