Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

Ysr : వైయస్సార్ ఆత్మ కూడా క్షోభిస్తుంది.. అరెస్టుపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు..!

Ysr : వైయస్సార్ ఆత్మ కూడా క్షోభిస్తుంది.. అరెస్టుపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు..!

మంగళగిరి , మన సాక్షి ;

మెగా డీఎస్సీ వేయాలని, నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల రెడ్డి చలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహించింది. కాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆమె ను అరెస్టు చేసి మంగళగిరి స్టేషన్ కు తరలించారు. దాంతో ఆమె జగన్ ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆమె మాట్లాడిన యధావిధిగా..

YSR ఆత్మ క్షోబిస్తుంది. ఈ ఘటనపై అమ్మ కూడా బాధపడుతుంది.

వైఎస్సార్ బిడ్డ పోరాటం చేసింది నిరుద్యోగుల కోసమే.

సచివాలయం లో వినతి పత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్చ కూడా లేదు.

జర్నలిస్ట్ లకు స్వేచ్చ లేదు.

సచివాలయంలో కనీసం ఒక్కరూ లేరట.

సీఎం రాడు..మంత్రులు లేరు..అధికారులు రారు.

వీళ్లకు పాలన చేతకాదు. అనడానికి ఇదే నిదర్శనం.

వీళ్లకు ఏది చేతకాదు.

బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం నోటిఫికేషన్ లు ఇవ్వడం చేతకాలేదు.

ఒక అడబిడ్డ అని చూడకుండా ఈ విధంగా ప్రవర్తించడం పాపం.

ALSO READ :

మరిన్ని వార్తలు