Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజనగామ జిల్లాజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Big Breaking : బీఆర్ఎస్ చలో మేడిగడ్డలో ఊహించని ఘటన.. ఒక్కసారిగా భయపడ్డ ఎమ్మెల్యేలు..!

Big Breaking : బీఆర్ఎస్ చలో మేడిగడ్డలో ఊహించని ఘటన.. ఒక్కసారిగా భయపడ్డ ఎమ్మెల్యేలు..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో మేడిగడ్డ కార్యక్రమం శుక్రవారం నిర్వహించిన విషయం తెలిసిందే. మార్గ మధ్యలో బస్సు ఒకసారిగా ఆగిపోయింది. దాంతో ఎమ్మెల్యేలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వివరాల ప్రకారం..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో శుక్రవారం చలో మేడిగడ్డ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి చలో మేడిగడ్డకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. దాంతో ఎమ్మెల్యేలు ప్రయాణించే బస్సు ఒకసారి గా బ్లాస్ట్ అయింది. మార్గమధ్యలో బస్సు ఆగిపోయింది. ఈ సంఘటన వల్ల బస్సులో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయాందోళనలకు గురయ్యారు.

ఈ సంఘటన జనగాం సమీపంలో చోటుచేసుకుంది. బస్సులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యేలు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికంగా మెకానిక్లను పిలిపించి నేతలు దగ్గరుండి టైర్ మార్పించారు. కాగా ఈ సంఘటనలో ఎవరికి ఏం కాకపోవడంతో నాయకులంతా ఊపిరి పీల్చుకున్నారు.

ALSO READ : BREAKING : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ పై కీలక ఆధారాలు సేకరణ..!

మరిన్ని వార్తలు