Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండసంక్షేమం

Miryalaguda : గృహజ్యోతి పథకం.. జీరో కరెంటు బిల్లులు ప్రారంభం..!

Miryalaguda : గృహజ్యోతి పథకం.. జీరో కరెంటు బిల్లులు ప్రారంభం..!

మిర్యాలగూడ , మార్చి 01, మన సాక్షి :

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం (వాడకం) వినియోగించుకున్న వినియోగదారులకు జీరో బిల్లులు ఇవ్వడం శుక్రవారం నుండి ప్రారంభమైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్ ఎడిఈ లు కోడిరెక్క రవికుమార్, రవీందర్ రెడ్డి వినియోగదారులకు జీరో బిల్లులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 200 యూనిట్ల లోపు గృహ వినియోగానికి అందజేసే ఉచిత విద్యుత్తును ప్రారంభమైనట్లు తెలిపారు .

అన్ని అర్హతలు ఉండి గృహ జ్యోతి రాని వినియోగదారులు వారి యొక్క ప్రజాపాలన ధరఖాస్తులో పొందుపరిచిన రేషన్ కార్డు వివరాలు ఆధార్ కార్డు వివరాలు అన్ని మండలాల ఎంపీడీవో ఆఫీస్ లో మరియు మున్సిపాలిటీ ఆఫీసులో సరిచూచుకోవాలని కోరారు. మిర్యాలగూడ ఈఆర్ఓ డివిజన్ ఆఫీసు నందు వారి యొక్క ఇంటి కరెంట్ బిల్లు మరియు మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ఆఫీసు నుండి పొందిన కంప్యూటర్ రసీదు కరెంట్ ఆఫీసులో చూయించి గృహ జ్యోతి పథకం కింద నమోదు చేయించుకోవాలన్నారు.

ALSO READ : Big Breaking : బీఆర్ఎస్ చలో మేడిగడ్డలో ఊహించని ఘటన.. ఒక్కసారిగా భయపడ్డ ఎమ్మెల్యేలు..!

జీరో యూనిట్ బిల్లు రానివారు ఎలాంటి ఇబ్బందుల గురికాకుండా ఎంపీడీవో ఆఫీసులో పోర్టల్ లాగిన్ అవుతున్నారు. కావున మీ యొక్క ఇంటి సర్వీస్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు నెంబరు మీ యొక్క మొబైల్ నెంబరు మరియొకసారి నమోదు చేయించుకుంటే ప్రతి వినియోగదారుడు కి జీరో బిల్ వస్తున్నదన్నారు. అర్హులైన వినియోగదారులు అందరూ విద్యుత్ సంస్థకు సహకరించగలరని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎఈ లు వెంకటేశ్వర్లు, అమర్ సింగ్, వెంకటరెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ మారం శ్రీనివాస్, సోమాచారి, మురళీమోహన్, సైదా, సురేందర్ రెడ్డి, కిరణ్, హేమంత్, మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కోడి రెక్క శౌరి, కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి, తిరుపతి రెడ్డి,కోడెరెక్క ఇంద్ర కుమార్, మహేశ్వరం రవి, నూనె గోపి, రాధా, జానకి, భీమమ్మ, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Telangana : కాంగ్రెస్ నేత వంశీ చందర్ రెడ్డి కెసిఆర్ కు సంచలన లేఖ..!

మరిన్ని వార్తలు