Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Telangana : కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలి..!

Telangana : కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలి..!

సికింద్రాబాద్, మన సాక్షి:

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ కొరకు యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్ట్ (తెలంగాణ స్టేట్) అధ్యక్షుడు డాక్టర్ ఏ. పరశురామ్ అధ్యక్షతన గురువారం ఉస్మానియా యూనివర్సిటీలో మహాసదస్సును నిర్వహించారు. ఈ మహా సదస్సుకు తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అద్యాపకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సదస్సును ఉద్దేశించి ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ అన్ని విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తూ ఇక ముందట కాంట్రాక్ట్ అనే వ్యవస్థను యూనివర్సిటీలో ఉండ కూడదు అని అన్నారు. అలాగే కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యోగ భద్రత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందనీ,ఇది సామాజిక న్యాయం లో భాగమని,సమాజ అవసరం నొక్కి వక్కానించారు. విశ్వవిద్యాలయాలు సమాజానికి వెన్నెముక లాంటివని అన్నారు.

ALSO READ : Inter Exams : ఇంటర్ విద్యార్థులకు తప్పని కష్టాలు.. ఐదు నిమిషాల గ్రేస్ నిబంధనలు పాటించని అధికారులు..!

అనంతరం ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వంతో కాంట్రాక్ట్ అద్దెపకుల సమస్యను వివరించి న్యాయం జరిగేటట్టు చూస్తానని హామీ ఇచ్చారు. విశ్వవిద్యాలయాలు సమాజానికి మూల స్తంభాలన్నారు. ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలలో కాంట్రాక్ట్ అధ్యాపకుల వ్యవస్థ కొనసాగడం దురదృష్టకరమని, వీళ్ళని రెగ్యులరైజ్ చేయ చేయడం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అన్నారు. ప్రొఫెసర్ రమా మేల్కోటే మాట్లాడుతూ ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని,ఇది సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు.

ఈ సదస్సులో డాక్టర్ ఎం జితేందర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రేమయ్య, పాలమూరు యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ భూమయ్య ,చేగుంటి రవికుమార్,కాకతీయ యూనివర్సిటీ నుండి డాక్టర్ సాదు రాజేష్, డాక్టర్ చిర్రా రాజు, తెలంగాణ మహిళా యూనివర్సిటీ నుండి డాక్టర్ వినీత పాండే, డాక్టర్ రవికుమార్,మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుండి డాక్టర్ శ్యాంసుందర్,డాక్టర్ తిరుపతి,జేఎన్టీయూ నుండి డాక్టర్ శివారెడ్డి,డాక్టర్ సురేష్,జే ఎన్ ఎఫ్ ఏ యూ నుండి డాక్టర్ రామకృష్ణయ్య ,

డాక్టర్ కాంతారెడ్డి,శాతవాహన యూనివర్సిటీ నుండి డాక్టర్ యశ్వంత్,తెలంగాణ యూనివర్సిటీ డాక్టర్ నారాయణ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి డాక్టర్ నాగరాజు,త్రిబుల్ ఐటీ బాసర నుండి డాక్టర్ శ్రీశైలం, ఉపేందర్,డాక్టర్ కృష్ణ కృష్ణ ప్రసాద్,ఈ సదస్సుకు టీ అట్ట అధ్యక్షులు డాక్టర్ రామేశ్వర్,తూటా ఓయూ ప్రెసిడెంట్ డాక్టర్ ఉపేందర్, ఓయూ క్యాప్ అధ్యక్షుడు డాక్టర్ ధర్మతేజ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ALSO READ : Rythu Bandhu : రైతు బంధు అందరికీ ఇవ్వరా.. ఒక ఎకరం ఉన్న వారికి రాదా..!

మరిన్ని వార్తలు