Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Inter Exams : ఇంటర్ విద్యార్థులకు తప్పని కష్టాలు.. ఐదు నిమిషాల గ్రేస్ నిబంధనలు పాటించని అధికారులు..!

Inter Exams : ఇంటర్ విద్యార్థులకు తప్పని కష్టాలు.. ఐదు నిమిషాల గ్రేస్ నిబంధనలు పాటించని అధికారులు..!

దేవరకొండ, మార్చి 07, మనసాక్షి:

ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షల సమయంలో కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం నిమిషం నిబంధన తో మొదటి రోజు చాలామంది విద్యార్థులు సమయానికి హాజరు కాకపోవడంతో పరీక్షలకు గైరాజరయ్యారు.

ఈ సంఘటనల వల్ల ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు దిగివచ్చి పరీక్ష సమయానికి ఐదు నిమిషాల పాటు గ్రేస్ కేటాయించారు. అయినా కూడా కొన్ని ప్రాంతాలలో అధికారులు నిబంధనలు పాటించడం లేదు. మూడు నిమిషాల పాటు ఆలస్యంగా వచ్చిన పరీక్ష హాల్లోకి విద్యార్థిని అక్కడి అధికారులు రానివ్వలేదు. ఈ సంఘటన నల్గొండ జిల్లా దేవరకొండ బాలికల జూనియర్ కళాశాలలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం..

జింకల భాను అనే విద్యార్థి దేవరకొండ వివేకనంద ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకోవడం జరుగుతుంది. గురువారం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష మైక్రో బైలేజీ పేపర్ 2 పరీక్ష ఉండడం వలన అతని పరీక్ష కేంద్రం ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో సెంటర్ పడడం జరిగింది. మైక్రో బైలేజి పరీక్ష కు మూడు నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాడు. ప్రభుత్వం అధికారికంగా నిమిషం నిబంధనలు ఎత్తేసి ఐదు నిమిషాల వరకు పెంచడం జరిగింది.

ALSO READ : BREAKING : సూర్యాపేట జిల్లా మఠంపల్లి లో డ్రగ్స్ అధికారుల దాడులు.. మెడికల్ షాప్ నిర్వాహకుడి అరెస్టు..!

కానీ అక్కడి అధికారులు ఆ విద్యార్థిని పరీక్షకు హాజరు కానివ్వలేదు. దాంతో అతడు గైర్హాజరయ్యాడు. కానీ దేవరకొండ బాలికల జూనియర్ కళాశాలలో ప్రభుత్వ నిబంధనలో పనిచేయమంటూ సీఎస్ విద్యార్థికి వివరించడం జరిగింది . విద్యార్థి పేరెంట్స్ కి సమాచారం ఇవ్వడంతో విద్యార్థి పేరెంట్స్ విద్యార్థి సంఘాలు నాయకులు పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోగా విద్యార్థుల పేరెంట్స్ ని విద్యార్థి సంఘ నాయకులను మందలించి అధికారిని ఇక్కడి నుంచి మీరు వెళ్లిపోవాలి. వెళ్లకుంటే పోలీస్ కంప్లేట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగిందన్నారు.

అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘం నాయకుడు యు ఎస్ ఎఫ్ ఐ పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ సౌభన్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి సి ఎస్ ను తక్షణం మే సస్పెండ్ చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా తన ఇష్ట సారంగను విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న విద్యాశాఖ అధికారులు కనీసం పట్టించుకునే స్థితిలో లేరని, విద్యార్థులకు న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షాన విద్యాశాఖ అధికారుల మీద జిల్లావ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు.

ALSO READ : Rythu Bandhu : రైతు బంధు అందరికీ ఇవ్వరా.. ఒక ఎకరం ఉన్న వారికి రాదా..!

మరిన్ని వార్తలు