Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : రేపు కేసీఆర్ మిర్యాలగూడ రాక..!

Miryalaguda : రేపు కేసీఆర్ మిర్యాలగూడ రాక..!

ఎండిన పంట పొలాలను పరిశీలించనున్న మాజీ సీఎం

మన సాక్షి , మిర్యాలగూడ :

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈనెల 31వ తేదీ ఆదివారం మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎండిన పంట పొలాలను పరిశీలించే భాగంలో సూర్యాపేట జిల్లాలో పరిశీలించిన అనంతరం మిర్యాలగూడ చేరుకుంటారు. సూర్యాపేట నుండి మిర్యాలగూడకు మధ్యాహ్నం మూడు 30.30 గంటలకు బయలుదేరుతారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఆమనగల్ , రావులపెంట, మొలకపట్నం , శెట్టిపాలెం గ్రామాలలో ఎండిన పంట పొలాలను పరిశీలించి 4 గంటల వరకు మిర్యాలగూడ పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు చేరుకుంటారు.

 

అనంతరం మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెం, శ్రీనివాస్ నగర్ , తుంగపాడు గ్రామాల మీదుగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి వెళ్ళనున్నారు. కాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు వివిధ స్థాయిలలోని పార్టీ నాయకులు , కార్యకర్తలు హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు చేరుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు కోరారు.

ALSO READ : Telangana New Ration Cards Process : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జారీ అప్పటి నుంచే..!

మరిన్ని వార్తలు