Nalgonda : ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో.. వెలుగులోకి సంచలన నిజాలు..!
ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఉదంతం ఆలోచిస్తే సమాజం ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. ఆచార్య దేవోభవ అనాల్సిన విద్యార్థులు గురువును హత్య చేసే పరిస్థితులు నెలకొన్నాయి.

Nalgonda : ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో.. వెలుగులోకి సంచలన నిజాలు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఉదంతం ఆలోచిస్తే సమాజం ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. ఆచార్య దేవోభవ అనాల్సిన విద్యార్థులు గురువును హత్య చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లాలోని సంచలనం కలిగించింది. ఈ సంచలనం కలిగించిన ప్రిన్సిపాల్ హత్య కేసును పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు.
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. గంజాయి కి అలవాటు పడిన ఆ విద్యార్థులు డబ్బుల కోసం ప్రిన్సిపల్ ను హత్య చేసినట్లుగా తెలుస్తుంది. దొంగతనానికి ప్రిన్సిపల్ రూపా రెడ్డి ఇంటికి వచ్చిన ఆ విద్యార్థులు ఆమెను హత్య చేసి ఆమె బ్యాగులో ఉన్న రెండు లక్షల రూపాయలను ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
ఈ నెల 11వ తేదీన సాయంత్రం 6 గంటలకు రూపారెడ్డి హత్యకు గురయ్యారు. ఆమె పాఠశాల ముగించుకొని ఇంటికి వచ్చే సమయానికి నిందితులు గోడ దూకి ఇంట్లో చేరి దాక్కున్నారు. ఆమె ఇంటి తాళం తీసి ఇంట్లోకి వెళ్ళగానే ఆమె వెనకాల వెళ్లి వంట గదిలో దాక్కున్నారు. ఆ తర్వాత ఆమె ఫ్రెష్ అయ్యి బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే వెనుక నుంచి వచ్చి కత్తితో 27 కత్తిపోట్లు పొడిచి ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత ఆమె హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న రెండు లక్షల రూపాయలతో పోరారయ్యారు. సీసీ కెమెరాలలో కనిపించకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొని హైదరాబాద్ కు వెళ్లి జల్సాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ హత్య కేసు పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. రూపారెడ్డి కుటుంబ సభ్యుల తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను సుమారుగా 120 మందిని పోలీసులు విచారణ చేసినట్లు సమాచారం. పదవ తరగతి విద్యార్థులు కేవలం గంజాయి మత్తుకు అలవాటు పడి జల్సాల కోసం డబ్బు కోసం ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యకు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు ఆరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. వారిలో ఒకరు అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి కాగా మరో ఇద్దరు పూర్వ విద్యార్థిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
MOST READ
- Viral : అన్నయ్య అనే పిలుపు కోసం ఎదురుచూస్తున్న బ్రహ్మానందం తోబుట్టు..!
- Nagarjunasagar : నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. లేటెస్ట్ అప్డేట్..!
- Nalgonda : నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూప రెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. హత్య చేసింది విద్యార్థులేనా..?
- BIG BREAKING : ఏసీబీకి చిక్కిన ఉత్తమ అధికారి, ఆత్మహత్య చేసుకున్న ట్రైనీ డిప్యూటీ తాసిల్దార్.. మరెన్నో బ్రేకింగ్ న్యూస్ | ManaSakshi









