అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..!
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని బసవపూర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ వద్ద దొంగతనాన్ని పోలీసులు చేదించి దొంగల అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..!
పుల్ కల్, (మన సాక్షి )
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని బసవపూర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ వద్ద దొంగతనాన్ని పోలీసులు చేదించి దొంగల అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. జోగిపేట సీఐ అనిల్ కుమార్ కథనం… ప్రకారం బసవపూర్ శివారులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం స్థలంలో 9న అర్ధరాత్రి ఐదుగురు దొంగలు 45 అల్యూమినియం ప్యానెల్ లను దొంగలించారు.
ఆంధ్రప్రదేశ్ అనంతపురం కు చెందిన మరాఠీ ప్రకాష్ ,సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేటకు చెందిన చాపల సురేష్, చాపల గోపాల్, కర్ణాటక రాష్ట్రం మైసూర్ కు చెందిన నానంపేట అనిల్, గోసాని రామచంద్ర లు, అంతరాష్ట్ర దొంగలని ..వీరిపై వివిధ రాష్ట్రా లా దొంగ త నా ల కేసులు ఉన్నాయని సిఐ అనిల్ కుమార్ తెలిపారు .
వీరు ఈ నెల 9న సింగూర్ డ్యాం వద్ద దావత్ చేసుకుని తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ స్థలంలో అర్ధరాత్రి 45 అల్యూమినియం దొంగిలించి వాహనం లో తరలించారు. అందుకు సంబంధించి తాడు దామపల్లి టోల్ ప్లాజా వద్ద సీసీ కెమెరా లో వీరి కదలికలు నిక్షిప్తమై ఉన్నాయి .టోల్ వద్ద ఫోన్ పే తో టోల్ ఫ్రీ చెల్లించారు. దొంగతనానికి సంబంధించి నిర్మాణ సంస్థ ఫిర్యాదు మేరకు పుల్కల్ ఎస్సై విశ్వజన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఐదుగురు దొంగలు దొరికారు. వీరిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కూ తరలించారు.









