Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆరోగ్యంజాతీయంతెలంగాణ

Climbing Stairs : మీరు ప్రతిరోజు మెట్లు ఎక్కి దిగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. కొత్త అధ్యాయంలో నిజాలు..!

Climbing Stairs : మీరు ప్రతిరోజు మెట్లు ఎక్కి దిగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. కొత్త అధ్యాయంలో నిజాలు..!

మన సాక్షి ,వెబ్ డెస్క్ :

ప్రతిరోజు కొంతమంది మెట్లు ఎక్కి దిగాల్సి వస్తుంది. ఇంటి వద్దనో.. కార్యాలయం వద్దనో.. తప్పనిసరిగా మెట్లు ఎక్కి దిగాల్సి వస్తుంది . మెట్లు ఎక్కి దిగినప్పుడు అలసిపోవడం, కాళ్లు నొప్పులు రావడం లాంటివి సర్వసాధారణమే. అయితే ప్రతిరోజూ మెట్లు ఎక్కి దిగితే ఏమవుతుందో ఓ కొత్త పరిశోధనలో వెల్లడైన నిజాలు ఏంటో తెలుసుకుందాం..

మానవుడు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే శరీరంలోని ముఖ్యమైన అవయవాలు గుండె, కాలేయం, కిడ్నీ.. ఇవి సక్రమంగా పనిచేయాలి. దాంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు శారీరక శ్రమ కూడా చాలా ముఖ్యమైనది. ఇలాంటివి వాటి వల్ల కీలకమైన అవయవాలు పనితీరు మెరుగుపడుతుంది.
మనిషి జీవితకాలం పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రతిరోజు మెట్లు ఎక్కి దిగినా కూడా మనిషి జీవితకాలం పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెళ్లడైంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

MOST READ : 

14 సంవత్సరాల జీవితకాలం పెరుగుదల :

క్రమం తప్పకుండా మెట్లు ఎక్కి దిగే వ్యక్తులు ఎంత ఎక్కువ కాలం జీవిస్తారో తెలుసుకోవడానికి పరిశోధన చేసేవారు సుమారుగా 5 లక్షల మంది ఆరోగ్య డేటాను అధ్యయనం చేశారు. ప్రతిరోజు రిపోర్టు ప్రకారం.. మెట్లు ఎక్కి దిగే వారి హృదయ సంబంధ వ్యాధుల కారణంగా మరణించే రిస్కు 39% తక్కువగా ఉంటుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వ్యక్తి జీవిత కాలం 14 సంవత్సరాలు పెరగడానికి కారణమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దాంతోపాటు ఇతర వ్యాధుల ప్రమాదాన్ని సైతం తగ్గిస్తుంది.

మెట్లు ఎక్కితే ప్రయోజనాలు :

మెట్లు ఎక్కడం అనేది వ్యాయామాల కంటే చాలా ప్రభావంతమైన పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు శరీరంలోని క్యాలరీలను కరిగించుకోవడానికి మెట్లు ఎక్కితే సరిపోతుంది. స్విమ్మింగ్, సైక్లింగ్, జాగింగ్ వంటి వ్యాయామాల కంటే మెట్లు ఎక్కడ వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల మెదడు ,గుండె, ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడుతుంది. శరీరంలోని ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. రక్తప్రసరణ పెరుగుతుంది. మెట్లు ఎక్కడం వల్ల శరీరం కూడా ఫిట్గా మారుతుంది. నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది.


ఆకస్మిక మరణం ముప్పు ఉండదు :

ప్రతిరోజు మెట్లు ఎక్కి దిగడం వల్ల శరీరంలోని కండరాలు సంకోచం వ్యాక్కోచం చెంది రిలాక్స్ గా అవుతాయి. ఇది అకాల మరణం ముప్పును తగ్గిస్తుందని అధ్యయనంలో పేర్కొంది. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కడం వల్ల సాధారణ జీవితకాలం కంటే 14 సంవత్సరాలు అదనంగా జీవించవచ్చని అధ్యయనంలో తేలింది.

అనారోగ్యాలకు మూలం :

ప్రస్తుతం ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి శారీరక శ్రమ తగ్గింది. ఒకప్పుడు రోజుకు కనీసం మూడు నాలుగు సార్లు మెట్లు ఎక్కే వాళ్ళు ఇప్పుడు ఎలివేటర్లు, ఎస్కలేటర్లు , లిఫ్టులు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా మెట్లను ఎవరు ఉపయోగించడం లేదు. ఉద్యోగాల్లో ఎక్కువగా డెస్క్ జాబులు ఉంటున్నాయి. వీటన్నింటికీ కూడా శారీరక శ్రమ బాగా తగ్గుతుంది. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ఆరోగ్యంగా ఉండాలంటే మెట్లు వినియోగించాలి :

ఎస్కలేటర్ అందుబాటులో ఉన్నప్పటికీ మెట్టను వినియోగించుకోవాలి. మెట్లు ఎక్కడం వల్ల మనిషి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎవరైనా చాలా ఎత్తయిన అంతస్తుకు వెళ్లాల్సి వస్తే శరీరం ఫిట్ గా ఉండేందుకు కనీసం నాలుగైదు అంతస్తులు ఎక్కాలి అని అధ్యాయంలో తేలింది.

ALSO EAD : 

మరిన్ని వార్తలు