WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు..!
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు..!
మన సాక్షి ఇంటర్నెట్ డెస్క్:
సమాచారాన్ని చేరవేసేందుకు సోషల్ మీడియా వేదికగా ఎక్కువమంది ఉపయోగించేది వాట్సాప్. దీనిని మరింత సులభతరం చేయడంతో పాటు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొచ్చి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతుంది. వాట్సాప్ ఉపయోగించని వారంటూ లేరు. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. వాట్సప్ కొత్త సదుపాయం కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రూప్ మెసేజ్ లలో ఈవెంట్ ప్లాన్ చేసుకునే విధంగా ఈ ఫీచర్ ని తీసుకువచ్చింది. ఈ కొత్త ఫీచర్ తో స్నేహితులు, స్కూలు, వర్చువల్, వ్యక్తిగత సమావేశాలను సెటప్ చేయడానికి అవకాశం ఉంది.
ఈవెంట్ సెటప్ చేయడం చాలా సులభతరంగా ఉంటుంది. ఈ వైట్ సేవలగానే కొత్త ఈవెంట్ ఫీచర్ పనిచేస్తుంది. ఈమెయిల్ ద్వారా ఆహ్వానాలను పంపే విధంగా ఈవెంట్ ఫీచర్ పనిచేస్తుంది. ఏదైనా గ్రూప్ సభ్యుల పుట్టినరోజు పార్టీలు, మీటింగులు, సెటప్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. గ్రూప్ ఇన్ఫర్మేషన్ పేజీకి పిన్ అయి ఉండేలా కొత్త ఈవెంట్ ఉంటుంది. గ్రూప్ చాట్ థ్రెడ్ క్రియేట్ అవుతుంది.
దానివల్ల ఈ మెసేజ్ ఎవరికీ చేరిందో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈవెంట్ కు వచ్చేవారు రిప్లై ఇచ్చి కన్ఫామ్ కూడా చేయొచ్చు. ఈ కొత్త ఈవెంట్ ద్వారా ఫీచర్ ద్వారా ఈవెంట్ క్రియేట్ చేయడంతో పాటు ఈవెంట్ క ఎవరెవరు వస్తారు.. అనే విషయం కూడా తెలుసుకోవచ్చును. ఈ ఫీచర్ ను వాట్సాప్ కమ్యూనిటీలో తీసుకొచ్చారు. ఇది కొద్ది రోజుల్లో వాట్సాప్ గ్రూప్ లకు యాడ్ చేయనున్నారు.
అనౌన్స్మెంట్ గ్రూపులకు రిప్లై ఇచ్చే మరో ఫ్యూచర్ ని కూడా ఈ వాట్సాప్ జోడిస్తుంది. దానివల్ల అడ్మిన్ సందేశం పై కామెంట్స్ తో పాటు ఫీడ్ బ్యాక్ ను కూడా పొందే అవకాశం ఉంటుంది. యూజర్ల పనికి అంతరాయం కలిగించకుండా మ్యూట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అదేవిధంగా నోటిఫికేషన్ బార్ లోనే రిప్లై ఇచ్చే ఫీచర్ కూడా ఉండనున్నది.
ALSO READ :
- Telangana : తెలంగాణ ప్రయోజనాల కోసం తెగించి కొట్లాడేది కేసీఆర్..!
- Climbing Stairs : మీరు ప్రతిరోజు మెట్లు ఎక్కి దిగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. కొత్త అధ్యాయంలో నిజాలు..!
- Telangana : తెలంగాణ మహిళలకు సర్కార్ శుభవార్త.. ఏకంగా లక్ష రూపాయలు..!
- Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇక మీ ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టగానే..!
- Truecaller : కాల్స్ , మెసేజ్ లు వచ్చినప్పుడు ఫోన్ చూడాల్సిన అవసరం లేదు.. డెస్క్ టాప్ లో ఎలా చూడాలో తెలుసుకోండి..!
- Telangana New Ration Cards Process : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జారీ అప్పటి నుంచే..!










