Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో తూనికల అధికారులు విస్తృత దాడులు.. 12 కేసులు నమోదు..!

Nalgonda : నల్గొండ జిల్లాలో తూనికల అధికారులు విస్తృత దాడులు.. 12 కేసులు నమోదు..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లాలో తూనికల, కొలతల శాఖ అధికారులు సోమవారం విస్తృత దాడులు నిర్వహించారు. జిల్లాలోని దేవరకొండ, మల్లేపల్లి ప్రాంతాల్లో పలు దుకాణాలను, పెట్రోల్ బంకులను తనిఖీలు చేశారు. 12 కేసులను నమోదు చేశారు. వివరాల ప్రకారం..

ప్రపంచ మెట్రోలజీ డే సందర్భంగా నల్గొండ జోన్ అసిస్టెంట్ కంట్రోలర్ కె సిద్ధార్థ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారి పి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతరం వినియోగదారులకు అవగాహన కల్పించారు. నల్గొండ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాస్, నల్గొండ పట్టణంలోని పలు దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఐరన్ హార్డ్వేర్ మరియు సిమెంట్ వ్యాపారస్తులపై ప్యాకేజింగ్ రూల్స్ ఉల్లంఘించినందుకు గాను 12 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

అంతేకాకుండా వ్యాపారస్తులు అమ్మే వస్తువులపై మ్యానిఫ్యాక్చరింగ్ అడ్రస్, రిటైల్ ప్రైస్, నెట్ క్వాంటిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్,బెస్ట్ బిఫోర్ వంటి ప్యాకేజింగ్ నిబంధనలను పాటించకపోతే వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ పి రామకృష్ణ హెచ్చరించారు. పెట్రోల్ బంక్ వ్యాపారస్తులు వినియోగదారుల కోరిక మేరకు అక్కడికక్కడే 5 లీటర్ల క్యాన్ తో వారి సమక్షంలో డెలివరీలు చెక్ చేసి చూపించాల్సిందిగా ఈ సందర్భంగా వారు తెలిపారు.

ఇవి కూడా చదవండి

Whatsapp : వాట్సాప్ లో డిలీట్ ఫర్ ఆల్ కు.. బదులు డిలీట్ ఫర్ మీ నొక్కారా.. అయినా రీస్టోర్ చేసుకోవచ్చు..!

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!

WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!

మరిన్ని వార్తలు