Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

NALGONDA : అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి..!

NALGONDA : అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి..!

నల్లగొండ, మనసాక్షి :

అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం,పి.డి.యస్ అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి, పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు గురువారం పోలీసు అధికారులు సిబ్బందితో ఆయన సమావేశమై మాట్లాడారు.

జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, సిబ్బంది అందరూ కలిసి సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి పిర్యాదుదారుని సమస్యను చట్ట పరిదిలో క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి బాదితులకు అండగా ఉంటూ సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటూ, పోలీసు శాఖ పైన ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కల్పించే విదంగా పని చేయాలని జిల్లా యస్పీ అన్నారు.

జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిదిలో పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవరిస్తూ, సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని అన్నారు.

విసిబుల్ పోలిసింగ్ ద్వారా నేర నియంత్రణ కట్టడి చేయాలని అన్నారు. కమ్మునిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవి లు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. డయల్ 100 పై ఏదైనా సమాచారం వస్తే వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించాలి అన్నారు.

అదే విదంగా దొంగతనాలు జరగకుండా పాత నేరస్తుల కదలికలపై నిఘా పెడుతూ పగలు,రాత్రి పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం,పి.డి.యస్ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, యస్బి డిఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు,సైబర్ క్రైమ్ డిఎస్పీ లక్ష్మి నారాయణ,సి.ఐ లు మరియు యస్.ఐ లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు