KCR : కెసిఆర్ అలర్ట్.. పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా, పెరిగిన ఆందోళన..!
KCR : కెసిఆర్ అలర్ట్.. పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా, పెరిగిన ఆందోళన..!
పార్టీ వీడిన వారి గురించి పట్టించుకోవద్దు
బిఆర్ఎస్ ఎమ్మెల్యే లతో అధినేత కేసీఆర్ సమావేశం
వరుసగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లతో భేటీలు ఉంటాయి
గజ్వేల్, మర్కుక్, మనసాక్షి :
బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వీడుతుండటంతో ఆ పార్టీ అధినేత కేసిఆర్ అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అయినా పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు.
మంగళవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్,మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్ రెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేశ్, రావుల శ్రీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వారితో కలిసి లంచ్ చేసిన కేసీఆర్,బీఆర్‌ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు.ఎవరూ తొందరపడొద్దని సూచించారు. ఇలాంటి పరిణామాలు ఆనాటి వైఎస్ హయాంలోనే జరిగాయని, అయినా మనం భయపడలేదని కేసీఆర్ గుర్తు చేశారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు.
కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. రేపట్నుంచి వరుసగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయని స్పష్టం చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో లాఅండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. భవిష్యత్తులో మనకు మంచి రోజులు వస్తాయని తెలిపారు.
కానీ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మ కొట్టడంతో కెసిఆర్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది. మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరుతారని ఆందోళన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తుంది.
ALSO READ :
Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?
BIG ALERT: వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు కట్.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..!









