Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

BRS : సమావేశానికే ఎమ్మెల్యేలు డుమ్మా.. GHMCలో అవిశ్వాసం నెగ్గేనా..?

BRS : సమావేశానికే ఎమ్మెల్యేలు డుమ్మా.. GHMCలో అవిశ్వాసం నెగ్గేనా..?

హైదరాబాద్ , మన సాక్షి :

జిహెచ్ఎంసి మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అందుకుగాను ముందుగా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో సమావేశం కావాలని నిర్ణయించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్పొరేటర్లు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి హైదరాబాద్ నగరంలో ఉండే జిహెచ్ఎంసి పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.

ఎమ్మెల్యేలు సమావేశానికి డుమ్మా కొట్టగా మేయర్, డిప్యూటీ మేయర్ పై నిర్వహించే అవిశ్వాసం నెగ్గుతుందా..? లేదా..? అనేది చూడాలి.

సమావేశానికి హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం పై రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా చర్చ సాగుతుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి , ఉప్పల్ లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, గూడెం మహిపాల్ రెడ్డి హాజరు కాలేదు. వీరంతా కారు దిగి కాంగ్రెస్ లో చేరుతారనే చర్చ సాగుతుంది.

కౌన్సిల్ హాల్ లో బైఠాయించాలని నిర్ణయం :

రేపటి కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ హాల్ లోనే బైటాయించాలని నిర్ణయించుకున్నారు. సంఖ్యాబలం చూసుకుంటే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు బీఆర్ఎస్ కి దక్కుతాయని కార్పోరేటర్లు చెబుతున్నారు. మా విషయానికి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో రేపటి సమావేశం ఆసక్తిగా మారే అవకాశం ఉంది. అవిశ్వాసం నెగ్గుతుందా..? లేదా..? అనేది వేచి చూడాల్సి ఉంది.

ALSO READ : 

Good News : డిగ్రీ చదివిన వారికి గుడ్ న్యూస్.. ఈ చాన్స్ అస్సలు మిస్ కావద్దు..!

Good News : రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు