Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : అశాడ (మంట్టెద్దుల) అమావాస్య.. అలా చేయడం అక్కడి ఆచారం..!

Narayanpet : అశాడ (మంట్టెద్దుల) అమావాస్య.. అలా చేయడం అక్కడి ఆచారం..!

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

ఆషాడంలో అమావాస్య ఘనంగా జరుపుకోవడం అక్కడి ప్రజల ఆచారం. తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఆషాడ మంట్టెద్దుల అమావాస్యను ఇలా జరుపుకుంటారు.  ఈ ఆషాడ అమావాస్య సందర్భంగా.. జిల్లా కేంద్రంలోని శ్రీ హంసవాహిని స్కూల్ లో శుక్రవారం అశాడ (మంట్టెద్దుల) అమావాస్య ను పురస్కరించుకుని చిన్నారులు మట్టితో ఎద్దులు, ఇతర వ్యవసాయ పనిముట్లు తయారు చేశారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పిల్లలో దాగివున్న కళను వెలికి తీయడం తో పాటు, వారికి పండుగ విశిష్టత తెలుస్తుందన్నారు. గ్రామీణ వాతావరణం తెలిసి వస్తుందన్నారు. అనంతరం మట్టి ఎద్దులకు పూజలు చేసి, చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. చక్కటి ప్రతిమలు చేసిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేష్, టీచర్స్ సుజాత, సౌజన్య, శిరీష, రేవతి, ఉదయ్ పాల్గొన్నారు.

ALSO READ :

BREAKING: జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి..!

BREAKING : వైద్య సేవలు ఎలా ఉన్నాయి.. ఎన్నో నెల ప్రెగ్నెన్సీ అని అడిగిన జిల్లా కలెక్టర్..!

మరిన్ని వార్తలు