Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : మిర్యాలగూడలో భారీగా గంజాయి పట్టివేత..! 

BREAKING : మిర్యాలగూడలో భారీగా గంజాయి పట్టివేత..! 

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. అక్రమ గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

మిర్యాలగూడ డిఎస్సీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్సై రవి వారి సిబ్బంది పట్టణంలో గాలింపు చర్యలలో ఉన్న క్రమంలో ఈ నెల 12 న మధ్యాహ్నం పట్టణ శివారు నందు అనుమానాస్పదంగా కనిపించిన రెండు వాహనాలు తనిఖీ చేశారు.

వెహికిల్ నెం.1 TS-08-0-0433 మహింద్రా బోలెరో వాహనం, 15-29-1-6434 మహిళ మెరాజొ వాహనాలను తనిఖీ చేసి క్రమంలో అందులో ఉన్న దాదాపు నలుగురు వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోగ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. అట్టి వాహనాలలో సుమారు 35 లక్షల రూపాయల విలువగల 140.585 కిలోల గంజాయి పట్టుబడిందని తెలిపారు.

గంజాయి అక్రమ రవాణా గురించి అదుపులోకి తీసుకున్న వ్యక్తి భూక్యా రాముని విదారించగా అతను చెప్పిన వివరాల ప్రకారం ఈరెండు వాహనాలు సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలానికి చెందిన నూనవత్ జగన్, నూనావిత మంద్యా నాయక్ ల ఆదేశాల మేరకు ఒకటి హైదరాబాద్ నుండి, మరొకటి సూర్యాపేట నుండి దేవరకొండ ప్రాంతంలో మద్దిమడుగు వెళ్ళే దారిలో నిర్జన ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తులు సరఫరా చేసిన గంజాయిని రెండు వాహనాలలో లోడ్ చేసుకుని జగన్, మంద్య నాయక్ ఆదేశాల మేరకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు .

ఇట్టి రవాణాలో సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలానికి చెందిన మరికొంత మండి ఉన్నట్లు తెలిపినాడు. పరారీలో ఉన్న నిందితుల గురించి మిర్యాలగూడ డి.ఎస్.పి ఆధ్వర్యంలో ముగ్గురు సిఐ లతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈ గంజాయి సప్లై చేసినది ఎవరు ఇది ఎటు రవాణా అవుతుంది అనే విషయమై పోలీసు వారు విదారణ చేస్తున్నారు. గంజాయి రవాణాలో పట్టుబడ్డ రాము పై మరియు ఇతర నిందితులపై గతంలో కేసులు ఉన్నాయని తెలిపారు

నిందితుల వివరాలు :

1. నూనవత్ బగన్, వయస్సు 32 సంఘాలు, బంజారాహిల్స్, పెన్ పహాడ్ మండలం, (పరారీలో ఉన్నాడు)

2. నూనావిత మంత్యా నాయక్, వయస్సు 45 సం//లు, జల్ మాల్ కుంట తండ, ఎన్ విహాడ్ మండలం, (పరారీలో

3. ఆంగోతు నాగరాజు, వయస్సు 33 సం||లు, లాల్ సింగ్ తిండి, ఏస్ పహాడ్ మండలం, (పరారీలో ఉన్నాడు)

4. బాణోతు సాయి, వయస్సు 28 సం//లు, జుబ్లీపుర, ఖమ్మం జిల్లా, (పరారీలో ఉన్నాడు).

5. భూక్యా రాము S/O రామోజీ, వయస్సు 35 సం!!లు, వృత్తి: ప్రైవేట్ ఎంప్లాయి, నివాసం: లాల్ సింగ్ తండ, పెస్ పహాడ్ మండలం (అరెస్ట్ చేయబడిన వ్యక్తి)

నిందితుడి నుండి స్వాదీన పర్చుకున్న పొత్తు వివరాలు :

1. 140.585 కిలోల గంజాయి (35 లక్షల విలువ గలది)

2. TS-08-D-0433 3. TS-29-F-6434

అక్రమ గంజాయి, మాదకద్రవ్యాలు సరఫరా చేస్తే ఉపేక్షించేది లేదు : జిల్లా యస్.పి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాదకద్రవ్య వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉక్కుపాదంతో అణిచివేస్తామని, ఎంతటి వారినైనా ఉపేక్షించం, యువతి మాదకద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. గంజాయి విక్షయాల గురించి గాని, సివించే వ్యక్తుల గురించి ఏ రూపంలోనైనా మాదకద్రవ్యాలను సరఫరా చేసేవారి గురించి మీకు సమాచారం తెలిస్తే డయల్ 100 ద్వారా లేదా నేరుగా తెలియజేయవచ్చు అన్నారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి మాదకద్రవ్యాల నివారణలో ప్రజలు, పోలీసు వారికి సహకరించి మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో అందరూ పాలుపంచుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు.

ఈ కేసులో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుదాకర్, పోలియా ఇన్స్పెక్టర్ జనార్ధన్, హాలియా ఎస్సై సతీష్, మిర్యాలగూడ వన్ టౌన్ ఎస్ఐ రవి మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

ఇవి కూడా చదవండి : 

ఫోన్ పే తో డబ్బులు తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండండి, మీకూ ఇలా జరగవచ్చు..!

Good News : ప్రయాణికులకు TGSRTC శుభవార్త.. ఇకపై తొలగనున్న కష్టాలు..!

మరిన్ని వార్తలు