ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో శీతరగానిపల్లె రోడ్డునిర్మాణంకు భూమి పూజ.. పనులు ప్రారంభిస్తున్న విజయ్ కుమార్ గౌడ్..!
ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో శీతరగానిపల్లె రోడ్డునిర్మాణంకు భూమి పూజ.. పనులు ప్రారంభిస్తున్న విజయ్ కుమార్ గౌడ్..!
రామసముద్రం, మనసాక్షి :
మండల కేంద్రంలోని శీతర గానిపల్లె గ్రామానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవ తో రోడ్డుకు మహర్థష, భూమి పూజ పనులు ప్రారంభించిన మండలటిడిపి పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ సర్పంచ్ కవితమ్మ. ఈ కార్యక్రమంలో విజయ్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గా షాజహాన్ బాషా మండల పర్యటన సందర్బంగా విజయ్ గౌడ్ గ్రామస్తులు గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలని అడగ్గా త్వరలోనే మంజూరు చేయిస్తానని మాటఇవ్వడం జరిగింది.
మాట ఇచ్చిన వారం రోజుల్లేనే రోడ్డు మంజూరు మండల పరిషత్ నిధులు రూ. 4లక్ష్మలు మంజూరు. ఎన్నో ఏళ్ళు గా ఎదురుచూస్తున్న రోడ్డు మంజూరు అవ్వడంతో గ్రామస్థులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా, విజయ్ కుమార్ గౌడ్,సర్పంచ్ కవితమ్మకు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యాక్రమంలో పాల్గొన్నా విజయ్ గౌడ్, పాలబత్తుల సుబ్రహ్మణ్యం, జయరాజ్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు.. తుంగభద్రకు భారీగా వరద, విద్యుత్ ఉత్పత్తితో సాగర్ కు నీటి విడుదల..!









