Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ

BREAKING : హడలెత్తిస్తున్న జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. రోజుకో అధికారి సస్పెండ్, వ్యవసాయ శాఖ ఏవో సస్పెండ్

BREAKING : హడలెత్తిస్తున్న జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. రోజుకో అధికారి సస్పెండ్, వ్యవసాయ శాఖ ఏవో సస్పెండ్

నల్లగొండ, మన సాక్షి :

నల్గొండ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలతో అధికారులు పాడలెత్తుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లోని వివిధ కార్యాలయాలను ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైరాజరవుతున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేస్తున్నారు. శుక్రవారం హాలియాలోని పిహెచ్ సీ లో సీనియర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేయగా శనివారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలోని పరిపాలన అధికారిని సస్పెండ్ చేశారు . వివరాల ప్రకారం..

ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, కనీసం సెలవు సైతం పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ వ్యవసాయ శాఖ పరిపాలనాధికారి అబ్దుల్ మన్నాన్ సస్పెన్షన్ చేశారు. శనివారం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఉద్యోగులు బాధ్యతగా పనిచేయండి. సమయపాలన పాటించండి. లేదంటే సస్పెన్షన్లు తప్పవని హెచ్చరిక చేశారు.

రైతు రుణమాఫీ పై కార్యాలయానికి వచ్చే రైతులకు సహాయం చేసేందుకు వ్యవసాయ శాఖ కార్యాలయంలో తక్షణమే రెండు కంప్యూటర్లు, రెండు ఫోన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇద్దరు ఆపరేటర్లు, ఇద్దరు సహాయకులు, ఫోన్లు స్వీకరించేందుకు ఇద్దరు, మరో ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లతో పాటు ప్రత్యేకించి కాల్స్ నమోదు చేసేందుకు మరో ఇద్దరు మొత్తం ఎనిమిదిని తక్షణమే ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు.

పంట రుణమాఫీకి సంబంధించి రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, కార్యాలయానికి వచ్చిన రైతులను వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్లాలని సాకులు చెప్పి పంపించవద్దు వెంటనే కంప్యూటర్ లో లాగిన్ అయ్యి రైతుకు డబ్బు ఎందుకు జమ కాలేదో చెప్పగలగాలన్నారు.

రైతు రుణమాఫీ పై జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని, గ్రీవెన్స్ రిజిస్టర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రుణమాఫీ డబ్బులు జమకాలేదని కార్యాలయానికి వచ్చిన చింతమల్ల సందీప్ కుమార్ తో మాట్లాడి వివరాలు తెలుసుకొన్న జిల్లా కలెక్టర్ వెంటనే రైతు సమస్యను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ ఏ డి హుస్సేన్ బాబుకు ఆదేశించి తిరిగి సాయంత్రం 4 గంటలకు కార్యాలయానికి వస్తానని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి : 

BREAKING : PHCని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్..!

శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు.. తుంగభద్రకు భారీగా వరద, విద్యుత్ ఉత్పత్తితో సాగర్ కు నీటి విడుదల..!

తెలంగాణలో రేవంత్ వర్సెస్ హరీష్ రావు, హాట్ టాపిక్ గా రాజకీయ సన్యాసం, రాజీనామా..!

మరిన్ని వార్తలు