TOP STORIESBreaking Newsతెలంగాణ

BUDGET 2024 : తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత..!

BUDGET 2024 : తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కేటాయించింది. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం 72 వేల 659 కోట్లను కేటాయించింది. అత్యధికంగా వ్యవసాయంగానికే కేటాయించడం విశేషం. గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించింది. అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో ఆరు గ్యారంటీలకు ప్రాధాన్యత కల్పించారు. 2024 – 25 వార్షిక బడ్జెట్ ఆయన ప్రవేశపెట్టారు.

2,91,159 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ రూ. 2,20,945 కోట్లు, మూలధన వ్యయం 33,487 కోట్లు, గృహ జ్యోతి కి 2,418 కోట్లు నీటిపారుదల రంగానికి 26 వేల కోట్లు, సంక్షేమానికి 40,000 కోట్లు, వ్యవసాయానికి 72,659 కోట్లు, హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్ల రూపాయలు, RRR కు 1525 కోట్లు, వైద్యం కు 11,468 కోట్లు, పాతబస్తీ మెట్రో విస్తరణకు 500 కోట్లు, హైడ్రా సంస్థకు 200 కోట్లు, జిహెచ్ఎంసి కి 3065 కోట్లు, బీసీ సంక్షేమం 9,200 కోట్లు కేటాయించారు.

ట్రాన్స్ కో డిస్కౌం లకు 16,410 కోట్లు, అడవులు పర్యావరణం 1064 కోట్లు, ఎస్టీ సంక్షేమం 17, 056 కోట్లు, మైనార్టీ సంక్షేమ 3003 కోట్లు, ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణకు 100 కోట్ల రూపాయలు, మూసి రివర్ ఫ్రంట్ కు 1500 కోట్ల రూపాయలు, హెచ్ఎండిఏ మౌలిక వసతులకు 500 కోట్లు కేటాయించారు. శ్రీ శిశు సంక్షేమం 2736 కోట్లు, హార్టికల్చర్ కు 737 కోట్లు , 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కు 723 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రజా పంపిణీకి 3836 కోట్లు కేటాయించారు.

ALSO READ : 

KCR : ఈస్ట్ మన్ కలర్ లా తెలంగాణ బడ్జెట్, ఏ రంగానికి ప్రాధాన్యత లేదు.. అసెంబ్లీ మీడియా పాయింట్ లో కేసిఆర్..!

BUDGET 2024 – 25 : అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.. ముఖ్యాంశాలు..!

SRISHAILAM : శ్రీశైలంకు భారీ వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీటి విడుదల..!

కేటీఆర్ కు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు.. కేటీఆర్ స్పందన ఏంటి..! 

మరిన్ని వార్తలు