Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Cm Revanth Reddy : కొత్త రైల్వే లైన్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి పరిశీలన..!

Cm Revanth Reddy : కొత్త రైల్వే లైన్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి పరిశీలన..!

నారాయణపేట టౌన్, మన సాక్షి :

కృష్ణా -వికారాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేయుటకు సోమవారం హైదరాబాద్ అసెంబ్లీ లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో పేట జిల్లా ఎమ్మెల్యేలతో కలసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కృష్ణా-వికారాబాద్ రైల్వే లైన్ రూట్ మ్యాప్ గురించి రైల్వేశాఖ చీఫ్ ఇంజనీర్ సుబ్రమణ్యన్ ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే లతో చర్చించి ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట, మక్తల్ మీదుగా రూ.3500 కోట్లతో 145 కీ.మీ రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో నారాయణపేట, పరిగి, మక్తల్ ఎమ్మెల్యేలు డా. చిట్టెం. పర్ణికరెడ్డి, రాంమోహన్ రెడ్డి, వాకాటి శ్రీహరి లు పాల్గొన్నారు.

ALSO READ :

➡️ District collector : కృష్ణానది పరివాహక ప్రాంతంలో అలర్ట్.. జిల్లా కలెక్టర్ హెచ్చరిక..! 

➡️ Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం  రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..!

➡️ WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ లేకుండానే క్రియేట్ చేయొచ్చు..!

మరిన్ని వార్తలు