మిర్యాలగూడ : టాయిలెట్స్ లేవని విద్యార్థినిలు ఎంఎల్ఏ కు మొర.. కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం..
మిర్యాలగూడ : టాయిలెట్స్ లేవని విద్యార్థినిలు ఎంఎల్ఏ కు మొర.. కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం..
మిర్యాలగూడ, మన సాక్షి:
పాఠశాలలో టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినిలు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. దాంతో ఆయన కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ పార్కు ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
గత ఏడాది నుంచి నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ విద్యార్థినిలకు టాయిలెట్ సౌకర్యాలను కాంట్రాక్టర్ నిర్మించలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని సోమవారం పాఠశాలను ఆకస్మికంగా స్థానిక ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి పరిశీలించేందుకు వచ్చారు.
దాంతో పైలెట్ సౌకర్యం లేక ఇబ్బందులు కలుగుతున్నాయని విద్యార్థినిలు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. దాంతో ఆయన కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా విద్యార్థినిలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ALSO READ :
Nagarjunasagar : తెరుచుకున్న సాగర్ గేట్లు.. నిండుగా కాలువలు.. పంట పొలాల్లో రైతుల సందడి..!
Nagarjunasagar : నాగార్జునసాగర్ 6 గేట్లు ఎత్తి నీటి విడుదల.. కృష్ణమ్మ పరవళ్ళు.. Latest Update
Accident : రోడ్డు ప్రమాదంలో తల్లీ కుమారుడి దుర్మరణం.. మరొకరి పరిస్థితి విషమం..!









