Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునిర్మల జిల్లా

Nirmal : నిర్మల్ లో ప్రపంచ ఆదివాసి దినోత్సవం..!

Nirmal : నిర్మల్ లో ప్రపంచ ఆదివాసి దినోత్సవం..!

నిర్మల్, మన సాక్షి :

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవ వేడుకలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజన వీరులు రాంజిగొండు, కొమురం భీం విగ్రహాలను పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…నిర్మల్ జిల్లాలో ఆదివాసీల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తానని తెలిపారు. వారికి అవసరమైన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యం గా నిలిచిన నిర్మల్ లోని వెయ్యి ఉరుల మర్రి ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఆదివాసీల అభ్యున్నతికి అన్ని విధాలా పాటుపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, జిల్లా బీజేపీ నాయకులు, గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

Runamafi : రుణమాఫీ రైతులకు వడ్డీ భారం.. బ్యాంకర్ల మెలిక..!

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. 50 కంపెనీలతో మెగా జాబ్ మేళ.. టెన్త్ పాస్ అయిన వారికి కూడా అవకాశం..!

భారీ గుడ్ న్యూస్ : ఫోన్ పే, గూగుల్ పే మీకు ఉందా..! ఉంటే తెలుసుకోవాల్సిందే

Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!

Good News : ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం, దరఖాస్తు చేసుకోండి ఇలా..!

మరిన్ని వార్తలు