Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుమంచిర్యాల జిల్లా

ఆదివాసీలను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు..!

ఆదివాసీలను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు..!

ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలి

అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు తొగరు రాజు డిమాండ్

ఘనంగా ఆదివాసీ దినోత్సవం

లక్షెట్టిపేట్, (మన సాక్షి);

కొమురం భీమ్ ఆశయాలు సాధించడానికి అంబేద్కర్ యువజన సంఘం నిరంతరం కృషి చేస్తుందని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు తొగరు రాజు పేర్కొన్నారు.

శుక్రవారం అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో గల కుమ్రం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నేటికీ గిరిజన, ఆదివాసీలు అభివృద్ధికి దూరంగా ఉన్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడి, అభివృద్ధి చేసే దిశగా పనిచేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు దొంత నర్సయ్య, పట్టణ ఉపాధ్యక్షులు బిరుదుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్, నాయకులు భైరం శ్రీనివాస్, అడ్వకేట్ రాజేష్ తదితరులు పాల్గోన్నారు.

ALSO READ : 

Runamafi : రుణమాఫీ రైతులకు వడ్డీ భారం.. బ్యాంకర్ల మెలిక..!

Rythu Barosa : రైతు భరోసా వారికేనా.. ఆలస్యం అందుకేనా..!

Good News : ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం, దరఖాస్తు చేసుకోండి ఇలా..!

Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!

మరిన్ని వార్తలు