Hyderabad : కబ్జాదారుల్లో వణుకుపుట్టిస్తున్న హైడ్రా..!
Hyderabad : కబ్జాదారుల్లో వణుకుపుట్టిస్తున్న హైడ్రా..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ( హైడ్రా ) దూసుకెళ్తాంది. ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా ఝుళిపిస్తోంది.
అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతోంది. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తూ చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చురుకుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారు.
రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలో హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తోంది. చెరువును ఆక్రమించిన కబ్జాదారులు ఏకంగా ప్లాట్లు వేసి నిర్మాణాలు చేపట్టారు.దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.
దీంతో సీఎం ఆదేశాల మేరకు ఇవాళ(శనివారం) తెల్లవారుజాము నుంచే హైడ్రా రంగంలోకి దిగింది. కూల్చివేతలు మొదలుపెట్టింది. అక్రమ నిర్మాణాల తొలగింపును వారు అడ్డుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
ఆ ప్రాంతానికి ఎవరినీ రానివ్వకుండా పటిష్ఠ బందోబస్తు మధ్య భవనాలు కూల్చివేస్తున్నారు. మంగళవారం రోజున కూడా గాజుల రామారం చింతలచెరువు బఫర్ జోన్లో 52 అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.
ఇవి కూడా చదవండి :
Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. రూ.5 కోట్లు అప్పు ఇస్తామని నమ్మించి, 60 లక్షలతో పరార్..!
ఉన్న గదులు కూల్చారు.. కొత్త వాటిని నిర్మించలేదు.. వరండాలో పాఠాలు..!
Viral : హాజరు వేయాలంటే ముద్దు ఇవ్వాలి.. తోటి ఉపాధ్యాయురాలికి ఉపాధ్యాయుడు వీడియో కాల్.. (Video)
భారీ గుడ్ న్యూస్ : ఫోన్ పే, గూగుల్ పే మీకు ఉందా..! ఉంటే తెలుసుకోవాల్సిందే









