Independence Day : స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పగడ్బందీగా నిర్వహించాలి..!
Independence Day : స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పగడ్బందీగా నిర్వహించాలి..!
నల్లగొండ, మనసాక్షి :
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సంవత్సరం నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఆయన జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారని, ఇందుకుగాను స్టేజి, అలంకరణ, వేడుకలకు హాజరయ్యే ప్రముఖులకు, ప్రజలు, మీడియా తదితరులందరికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రోటోకాల్ ప్రకారం సీట్లు ఏర్పాటు తో పాటు, టెంట్లు, తాగునీరు, ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. వర్షం వచ్చినా ఇబ్బంది కలగకుండా ఉండేలా రైన్ ప్రూఫ్ టెంట్లు వేయాలని చెప్పారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కార్యక్రమాలను ఆయన వివరిస్తూ ఉదయం 9 గంటలకు ముఖ్య అతిథి జాతీయ పతాకావిష్కరణ చేస్తారని, పోలీసు గౌరవ వందనం స్వీకరణ, జిల్లా ప్రజలను ఉద్దేశించి అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సాధించిన ప్రగతిపై ముఖ్య అతిథి ప్రసంగం, శకటాల ప్రదర్శన, పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకుగంటలకుసా పత్రాల పంపిణీ, ఆయా పథకాల కింద లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ ,స్టాల్స్ సందర్శన ఉంటాయని, ఈ కార్యక్రమాలన్నీ నిర్దేశించిన సమయం ప్రకారం పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చే విద్యార్థులకు గ్రౌండ్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని, స్టేజిని పూలతో అలంకరించాలని అన్నారు.వేడుకలకు హాజరయ్యే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు,అధికారులు,మీడియా ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు.
గ్రౌండ్లో తాగునీటితోపాటు ,పరిశుభ్రత చూడాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. వాహనాల పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని , కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి పూర్తయ్యె వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్ , గృహ నిర్మాణ పి డి రాజ్ కుమార్, ఆర్ డి ఓ రవి, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు, పొరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, మున్సిప్రతినిధులకు సయ్యద్ ముసాబ్ అహ్మద్, పి శివశంకర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్త దితరులు ఉన్నారు.
ALSO READ :
Runamafi : రుణమాఫీపై మరో కీలక ప్రకటన.. వారి కోసం త్వరలో స్పెషల్ డ్రైవ్..!
Jobs : తెలంగాణలో వెయ్యి పోస్టుల భర్తీ.. జాబ్ క్యాలెండర్ లో ఆ పోస్టులు..!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే టిసి ఉద్యోగాలు, 11,250 ఖాళీలు..!









