Khammam : రైతు సంఘాల ధర్నాలో మంత్రి తుమ్మల.. రుణమాఫీ పై ఏమన్నారంటే..!
Khammam : రైతు సంఘాల ధర్నాలో మంత్రి తుమ్మల.. రుణమాఫీ పై ఏమన్నారంటే..!
ఖమ్మం, మన సాక్షి :
అందరికీ రుణమాఫీ చేయాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. కాగా ధర్నా వద్దకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెళ్లారు. అక్కడ ధర్నా చేస్తున్న రైతులకు రుణమాఫీ పై స్పష్టతనిచ్చారు.
రైతు రుణమాఫీ అవ్వని రైతులు అపోహ పడొద్దన్నారు. కుటుంబ నిర్దారణ కానీ రైతుల ఇళ్లకు వ్యవసాయ శాఖ సిబ్బంది వెళ్లి వివరాలు సేకరిస్తారని, రైతుల ఇంటి వద్దే కుటుంబ నిర్దారణ చేసి వివరాలు యాఫ్ లో అప్ లోడ్ చేస్తారన్నారు.
బ్యాంక్ ల్లో మొత్తం 42 లక్షల రైతులు 31 వేల కోట్లు అప్పు ఉన్నారని, రెండు లక్షల రుణమాఫీ 18 వేల కోట్లు రైతులు ఖాతాల్లో జమ చేశామన్నారు. రెండు లక్షల పైన రుణాలు ఉన్న రైతుల రుణమాఫీ పై క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటామన్నారు.
గత ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ పై కాగ్ నివేదిక లో వాస్తవాలు వెల్లడయ్యాయని, రైతులను గందర గోళం చేసే పనులు చేయొద్దన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వాగ్దానం చేసినట్లు 31 వేల కోట్లు రుణమాఫీ చేసి తీరుతామన్నారు.
LATEST UPDATE :
మిర్యాలగూడ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీఎంఆర్ఎఫ్ స్కాం.. అరెస్టుకు సిద్ధమైన సిఐడి..!
తెలంగాణలో 10,594 వీఆర్వోల నియామకం.. నోటిఫికేషన్..!
Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!
Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!









