TOP STORIESBreaking Newsతెలంగాణరాజకీయం

Panchayathi Elections : మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు.. బ్యాలెట్ తోనే నిర్వహణ..!

Panchayathi Elections : మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు.. బ్యాలెట్ తోనే నిర్వహణ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో బ్యాలెట్ బాక్స్ లతోనే నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,991 గ్రామపంచాయతీలు ఉన్నందున ఒకే విడత ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ల నుంచి బ్యాలెట్ బాక్స్ తెప్పించాల్సి ఉంది.

అందుకుగాను మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఎన్నికల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల నియామకం, వారికి శిక్షణ కార్యక్రమాలను కూడా చేపట్టనున్నారు. పార్టీ రహితంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.

గ్రామపంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిసి ఏడు మాసాలు గడుస్తుంది. దాంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసిన వెంటనే నోటిఫికేషన్ వెలువలనున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్థసారథి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ఓటర్ల ముసాయిదా జాబితాను సెప్టెంబర్ 6వ తేదీన గ్రామపంచాయతీలో ప్రచురించాలని, ఆ తర్వాత మండల, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. వారి సలహాలు, సూచనలు స్వీకరించాలని కలెక్టర్లను కోరారు.

జాబితాలో తప్పులుంటే సెప్టెంబర్ 13న గ్రామపంచాయతీ అధికారులు ప్రజల నుంచి రాతపూర్వకంగా తీసుకోవాలన్నారు. సవరణల అనంతరం వచ్చేనెల (సెప్టెంబర్) 21వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని తెలిపారు. ఆ తర్వాత ఏవైనా మార్పులు చేర్పులు అవసరమైతే ప్రజలు శాసనసభ నియోజకవర్గ ఓటర్ల రిజిస్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకుంటే అనుబంధ జాబితాలను విడుదల చేస్తారన్నారు.

గ్రామ పంచాయతీలో ఓటర్ల జాబితా తయారీ వార్డుల వారిగా పోలింగ్ స్టేషన్ల లో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న ఎంపీవో, ఎంపీడీవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులకు సూచించారు.

LATEST UPDATE : 

Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి..!

Rythu Barosa : రైతు భరోసా యాప్ తో రుణమాఫీ సమస్యలకు చెక్..!

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!

తెలంగాణలో 10,594 వీఆర్వోల నియామకం.. నోటిఫికేషన్..!

మరిన్ని వార్తలు