Nalgonda : రాయితో కొట్టి, గొంతు నులిమి భర్తను హత్య చేసిన భార్య..!
Nalgonda : రాయితో కొట్టి, గొంతు నులిమి భర్తను హత్య చేసిన భార్య..!
నల్లగొండ, మనసాక్షి :
పథకం ప్రకారం భర్తను హత్య చేసిన భార్యను ఆమె ప్రియుడిని నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ డిఎస్పి శివరామిరెడ్డి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం..
ఈనెల 28వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో పట్టణంలోని హైటెక్ కాలనీలో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కోపంతో పథకం ప్రకారం భార్య, ప్రియుడు కలిసి భర్త ఓర్సు వెంకన్నను హత్య చేశారు. కేసులో నిందితులైన మృతుడు వెంకన్న భార్య మైసమ్మ ఆమె ప్రియుడు కండే బిక్షములను అరెస్టు చేసినట్లు నల్గొండ డిఎస్పి శివరామిరెడ్డి తెలిపారు.
శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం పట్టణంలోని దేవర కొండ రోడ్డులో గల హరిత హోటల్ దగ్గర ఓర్సు వెంకన్నని హత్య చేసిన నిందితులు ఓర్సు మైసమ్మ, కండే బిక్షం లు పారిపోతున్నారని వచ్చిన సమాచారం మేరకు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి అతని సిబ్బంది కలిసి వారిని పట్టుకున్నట్లు తెలిపారు.
డి.ఎస్.పి తెలియజేసిన వివరాల ప్రకారం ఈనెల 28న రాత్రి సమయంలో మద్యం కోసం ఓర్సు వెంకన్న బయటకు వెళ్లిన సమయంలో కండే బిక్షం మైసమ్మతో సన్నిహితంగా ఉండటం చూసి భిక్షాన్ని వెంకన్న పట్టుకుందామని సరికి బిక్షం పారిపోయాడు.
అక్కడే ఉన్న భార్య మైసమ్మను వెంకన్న కొట్టబోతుండగా ముందుగా అనుకున్న విధంగా తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కోపంతో ఖండే బిక్షం ప్రోత్సహంతో బాగా మద్యం మత్తులో ఉన్న ఓట్స్ వెంకన్నను మైసమ్మ రాయిపై బలంగా నెట్టేసి ఆపై అతని మీద కూర్చుని గొంతు నులిమి హత్య చేసి చేసి పారిపోయిందని తెలిపారు.
పోలీసులకు దొరకకుండా నల్గొండ పట్టణంలో నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని తెలిపారు.
TELUGU NEWS :
TG NEWS : తెలంగాణ కాంగ్రెసులో కోల్డ్ వార్..? ఉత్తమ్ సీఎం అవుతారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు..!
Alert : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలే..!
రేవంత్, బట్టి విక్రమార్క, ఉత్తమ్ భేటీ.. కీలక నిర్ణయం..!
Miryalaguda : మిర్యాలగూడలో యువకుడి హత్య.. ఆలస్యంగా వెలుగులోకి..!









