Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
Hyderabad : హైదరాబాదులోని బాలాపూర్ లో దారుణం.. ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..!
హైదరాబాదులోని బాలాపూర్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్రియురాలిని హత్య చేసి గోనెసంచిలో పడేశాడు.

Hyderabad : హైదరాబాదులోని బాలాపూర్ లో దారుణం.. ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..!
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాదులోని బాలాపూర్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్రియురాలిని హత్య చేసి గోనెసంచిలో పడేశాడు. వివరాల ప్రకారం.. స్థానికంగా ఫంక్షన్ హాల్ లో పనిచేస్తున్న యువతి (21)కి ప్రేమ పేరుతో అహ్మద్ అని వ్యక్తి దగ్గరయ్యాడు. ఇటీవల ఆ యువతి గర్భం దాల్చడంతో ప్రియుడిపై పెళ్లి చేసుకోమని వత్తిడి చేసింది. దాంతో ఎలాగైనా ఆమెను తప్పించాలని అహ్మద్ ప్రయత్నం చేశాడు.
ఆమెను హత్య చేసి గోనెసంచిలో పడేసి తరలిస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోనెసంచిలో యువతి మృతదేహాన్ని తరలిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేశారు. నిందితుడు బీహార్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.









