క్రైంBreaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా
Help Line : భారీ వర్షాలకు.. హెల్ప్ లైన్ నెంబర్ 8712656760..!
Help Line : భారీ వర్షాలకు.. హెల్ప్ లైన్ నెంబర్ 8712656760..!
కంగ్టి, మన సాక్షి :
భారీ వర్షాలకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ విజయ్ కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
గ్రామాలలో విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని అన్నారు. పురాతనమైన ఇండ్లలో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అన్నారు. అత్యవసరమైతే తప్ప అనవసరంగా బయటకు రావద్దని అన్నారు చెరువులు కుంటలు దాటోదన్నారు.
మండలంలోని ఆయా గ్రామాలలో వర్షాల వల్ల ఇబ్బంది ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా హెల్ప్ లైన్ నెంబర్ 8712656760 ఏర్పాటు చేశామని అన్నారు.










