భారీ వర్షాలకు కూలిన ఇండ్లు..!
భారీ వర్షాలకు కూలిన ఇండ్లు..!
వేములపల్లి, మన సాక్షి :
జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు ఇల్లులు కూలిన సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం….
గ్రామానికి చెందిన ఓరుగంటి లక్ష్మయ్య-నాగలక్ష్మి, పజ్జూరి ఎల్లమ్మ ఇల్లులు ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి కూలిపోయింది అని తెలిపారు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఎల్లమ్మ…ఒక్కసారిగా భారీ వృక్షం కూలి ఇల్లు నేలమట్టం అయింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణానష్టం జరగలేదు.
అనంతరం స్థానిక ఎమ్మార్వోతో చరవాణి ద్వారా మాట్లాడారు. ప్రభుత్వం నుంచి బాధితులకు సహాయం అందేలా చూడాలన్నారు.ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేయాలని బాధితులు కోరారు. ప్రభుత్వం తమకు న్యాయం చేసేలా చూడాలని వేడుకున్నారు.
కంగ్టి లో వర్షంకు కూలిన ఇల్లు :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కంగ్టి గ్రామానికి చెందిన మహిబుబ్ బి నివాసం ఉంటున్న ఇల్లు భారీ వర్షం రావడంతో ఇల్లు కూలిపోయిందని ఆమె తెలిపారు. సోమవారం కూలిపోయిన ఇల్లుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని అధికారులకు వేడుకుంటున్నారు.
LATEST UPDATE :
Railway : రాత పరీక్ష లేకుండానే రైల్వే జాబ్.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు..!
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!
TG NEWS : తెలంగాణ కాంగ్రెసులో కోల్డ్ వార్..? ఉత్తమ్ సీఎం అవుతారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు..!
Runamafi : రుణ మాఫీ కోసం రేషన్ కార్డులేని రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!









