Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం..!

Nalgonda : నల్గొండ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం..!

దేవరకొండ,  మనసాక్షి :

స్నేహితులతో చేపల వేటకు వెళ్లి నీటిలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన నల్గొండ జిల్లా పెద్దఅడిశలపల్లి మండలంలోని అక్కంపల్లి ప్రాజెక్టు వద్ద చోటు చేసుకుంది. గల్లంతయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే దేవరకొండ పట్టణానికి చెందిన ఇద్దరు స్నేహితులు కలిసి ఆదివారం సాయంత్రం చేపలు పట్టేందుకు అక్కంపల్లి ప్రాజెక్టు దగ్గరకి వెళ్లారు. ఈ క్రమంలో దేవరకొండ పట్టణానికి చెందిన జుబేర్ హుస్సేన్
అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగి గల్లంతయ్యాడు.

వెంటనే అతడి స్నేహితుడు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే జుబేర్ హుస్సేన్ ను గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LATEST UPDATE : 

Runamafi : రుణమాఫీ పై స్పష్టత.. మాఫీ కాని వారికి ఎప్పుడంటే..!

దేవరకొండ ఆసుపత్రిలో ఐదు రోజుల పసికందు మృతి.. ఉద్రిక్తత..! 

మిర్యాలగూడ : మాజీ సీఎం వైఎస్ జగన్ పేరుతో గణేష్ లడ్డు లక్కీ డిప్..!

నల్లగొండ మున్సిపాలిటీకి అత్యుత్తమ గౌరవం.. దేశంలోనే రెండో స్థానం.. 25 లక్షల నగదు పురస్కారం..!

మరిన్ని వార్తలు