తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంసూర్యాపేట జిల్లా

తప్పుల తడక ఓటర్ల జాబితా.. వార్డుల విభజన అస్తవ్యస్తం..!

తప్పుల తడక ఓటర్ల జాబితా.. వార్డుల విభజన అస్తవ్యస్తం..!

అర్వపల్లి, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్ర గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజల సందర్శన కొరకు ఏర్పాటుచేసిన ఓటర్ లిస్టులు మొత్తం కూడా తప్పుల తడుకలుగా ఉన్నాయని వాటిని వెంటనే సవరించాలని మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ నాయకులు కరుణ కుమార్ రెంటాల, బీసీ యువజన సంఘం నాయకులు నిమ్మల హరికృష్ణ, మండల బిసి వెల్ఫేర్ నాయకులు బింగ్ శ్రీకాంత్ యాదవ్ అన్నారు.

సోమవారం తమ గ్రామంలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో గ్రామ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లుతెలిపారు. జాజిరెడ్డిగూడెం కార్యదర్శి కి అభ్యంతరాలను తెలియజేశామని అన్నారు.

జాజిరెడ్డిగూడెంలోని 12వ వార్డులో ఉండవలసిన ఓటర్లు గ్రామం మొత్తం అన్ని వార్డుల్లో ఒక్కలు ఇద్దరు చొప్పున వేరు చేయబడ్డట్లు తెలిపారు. 12వ వార్డు పై సమగ్ర సర్వే నిర్వహించి ఆ వార్డులను ప్రజలందరూ ఒకే వార్డులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఓట్లు పెరిగితే వార్డులను పెంచాలని కోరారు,

వార్డుల విభజన శాస్త్రీయ ప్రకారం జరగలేదని గతంలో అనేక మంది యువకులు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేనట్లు ఆరోపించారు.

అర్వపల్లిలో వార్డుల విభజన అస్తవ్యస్తం : 

మండల కేంద్రమైన అర్వపల్లి లో వార్డుల విభజన పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నట్లు అర్వపల్లి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బింగి శ్రీకాంత్ యాదవ్ ఆరాధించారు. ఒకే ఇంట్లోని ఓటర్లు రెండు నుండి మూడు వార్డులకు విడిపోయినట్లు ఓటర్ లిస్టులో నమోదు జరిగిందని ఆరోపించారు.

గ్రామంలోని ఓటర్ లిస్టుపై అవగాహన లేని వాళ్లు వార్డులు విభజనను నిర్వహించారని అన్నారు. గ్రామంలోని పెద్దమనుషులను, విచారించి కుటుంబ సభ్యులందరూ ఒకే వార్డులో ఉండే విధంగా ఓటర్ లిస్టును సవరించాలని అధికారులకు తెలియజేశారు.

LATEST UPDATE : 

Ration Cards : కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. విధి విధానాలు.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం..!

Komatireddy : రూ. 2000 కోట్లతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్లుగా విస్తరణ..!

Rythu Barosa : 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయం.. రైతు భరోసా ప్రారంభం అప్పుడే..!

Cm Revanth : రుణమాఫీ పై సీఎం రేవంత్ సంచలన ప్రకటన..!

మరిన్ని వార్తలు