Breaking Newsfoodజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Municipal Commissioner : మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు.. ఫుడ్ కోర్టుకు భారీ జరిమానా..!

Municipal Commissioner : మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు.. ఫుడ్ కోర్టుకు భారీ జరిమానా..!

రాజేంద్రనగర్, మనసాక్షి :

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర పలు హోటల్స్ ఫుడ్ కోర్టు లపై బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటల్ యజమానికి 10,000/- జరిమానను బండ్లగూడ జాగీర్ కమీషనర్ శరత్ చంద్ర విధించారు.

బుధవారం హైదర్షకోట శాంతినగర్ లోని శ్రీ రమణ మహర్షి ఫుడ్ కోర్ట్ ను కమిషనర్ ఆకస్మికంగా తనిఖి చేయగా హోటల్ యాజమాన్యం ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు అని గుర్తించి యజమానికి 10,000/- జరిమానా విధించినట్లు కమిషనర్ పేర్కొన్నారు.

మరల ఇలా ఇస్టానుసారంగా హోటల్ ను నిర్వహిస్తే సీజ్ చేస్తామని వారిని హెచ్చరించారు.కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నరేష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రవణ్, శానిటరీ జవాన్లు మల్లేష్, నరేందర్, రాము,శ్రీనివాస్, కృష్ణ పాల్గొన్నారు.

LATEST UPDATE : 

Devarakonda : మైనార్టీ గురుకులంలో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్.. ఆచూకీ చెప్పాలని విద్యార్థుల తల్లిదండ్రులు..! 

Ganesh Laddu : రికార్డ్ బ్రేక్.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్ లడ్డు..!

Ration Cards : పేదలకు ఇక సన్న బియ్యం.. ప్రభుత్వ నిర్ణయం, ఎప్పటి నుంచి అంటే..! 

తప్పుల తడక ఓటర్ల జాబితా.. వార్డుల విభజన అస్తవ్యస్తం..!

మరిన్ని వార్తలు