Miryalaguda : ప్రభుత్వ ఆసుపత్రిలో కిటకిటలాడిన రోగులు.. ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ..!
Miryalaguda : ప్రభుత్వ ఆసుపత్రిలో కిటకిటలాడిన రోగులు.. ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సోమవారం రోగులతో కిటకిటలాడింది. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న గ్రామీణ ప్రాంతాల వారు ఉదయమే ఆసుపత్రికి చేరుకున్నారు. ఔట్ పేషెంట్లు భారీగా వచ్చారు. దూరప్రాంతాల నుంచి అనేకమంది పేషెంట్లు వచ్చారు.
స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషంట్ల వివరాలను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బంది, వైద్యులతో మాట్లాడారు. సమయపాలన పాటించాలని, ఆసుపత్రికి వచ్చిన రోగులకు త్వరగా వైద్యం అందేలా చూడాలని పేర్కొన్నారు.
అదేవిధంగా ఆసుపత్రికి వచ్చే గర్భిణి మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. గర్భిణీ మహిళలను ఎక్కువ సేపు ఆస్పత్రిలో ఉంచకుండా వెంటనే వైద్యం అందించి పంపాలని వైద్యులకు సూచించారు.
LATEST UPDATE :
Uttam Kumar Reddy : పింఛన్లు, రేషన్ కార్డుదారులకు భారీ గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి..!
Nalgonda : మూసి ప్రవాహంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు.. కాపాడిన పోలీసులు..!
తనకు, తన కూతురికి న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు భార్య ధర్నా..!
Hyderabad : ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..!









