Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్సినిమా

DEVARA : దేవర సినిమాలో మనోడు.. వెండి తెరపై మెరిసిన కురబలకోట కుర్రోడు..!

DEVARA : దేవర సినిమాలో మనోడు.. వెండి తెరపై మెరిసిన కురబలకోట కుర్రోడు..!

మదనపల్లి, మన సాక్షి :

కొరటాల శివ దర్సకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రిలీజైన దేవర మూవీలో కురబలకోట మండలం తెట్టు గ్రామం రిషివ్యాలీ స్కూల్ పక్కనున్న శ్రీరాములవారిపల్లెకు చెందిన నరేష్ రాజ్ కీలక పాత్ర పోషించారు. ఇతనికి తొలి సినిమా ఇది. మూవీ సెకండాఫ్ లో ఇతని రోల్ వస్తుంది. విలన్ పాత్రధారి సైఫ్ అలీఖాన్ వద్ద సపోర్టు పాత్రలో కన్పిస్తాడు.

సినిమాలో 40 నిమిషాల పాటు ఇతను అక్కడక్కడా కన్పిస్తాడు. ఎన్టీఆర్ తో నేరుగా డైలాగులతో పాటు ఫైట్ సీన్ కూడా ఉంది. ఇతని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆడిషన్స్ ద్వారా ఈ సినిమాకు ఎంపికైనట్లు నరేష్ రాజ్ తెలిపారు. ఇదివరలో బ్రహ్మముడి, ముక్కుపుడక, రాజశ్రీ విలాస కాఫీక్లబ్, అర్ధాంగి, గువ్వ గోరింక, కుంకుమ పువ్వు, పలుకే బంగారు మాయె తదితర ప్రముఖ టీవీ సీరియళ్లలో కూడా విలన్ గా సైడ్ హీరోగా నటించాడు.

ఇతని తండ్రి నరసింహులు రిషివ్యాలీ స్కూల్ లో పనిచేస్తున్నాడు. సాధారణ కుటుంబానికి చెందిన ఇతను బీకాం వరకు చదివాడు. అతర్వాత పదేళ్లుగా చెన్నైలో ఉంటూ బతుకు దెరువు కోసం వివిధ పనులు చేశాడు. రెండేళ్లుగా హైదరాబాదులో జూనియర్ ఆర్టిస్టుగా మలి జీవితాన్ని ప్రారంభించారు.

టీవీ సీరియళ్లలో నటన అనుభవం నేర్పింది. దేవర సినిమాలో గుర్తింపు ఉన్న పాత్రలో నటించాడు. తను నటించిన తొలి సినిమాను వెండి తెరపై చూసినప్పుడు ఎంతో సంతోషమనిపించిందన్నారు. మరిన్ని అవకాశాలు రాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో ప్రముఖ బ్యానర్ లో అదీ ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా అవకాశం రావడం అంత సులభం కాదు..

అలాంటిది ఇతనికి తొలి ప్రయత్నంలోనే దేవర సినిమాలో అది విజయవంతమైన సినిమాలో అవకాశం రావడం గొప్పవిషయం. మదనపల్లెతో పాటు ఇక్కడి పరిసర ప్రాంత వాసులు పలువురు ఇతన్ని అభినందిస్తున్నారు.

LATEST UPDATE : 

Bigg Boss Telugu 8 : ఈ వారం హౌస్ లో ఉండేది ఎవరు.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

Bigg Boss 8 Telugu : పృథ్వీ అరాచకం.. హాగ్ లతో సోనియా..!

Healthy Liver : మురికి మొత్తం శుభ్రం చేయబడుతుంది, కాలేయాన్ని బలోపేతం చేయడానికి ఈ ఆహారం తీసుకోండి..!

మరిన్ని వార్తలు